అగ్గిపుల్ల చెవిలో పెట్టి తిప్పుతున్నారా? అయితే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

చెవి దురద పెట్టినా.. ఇరిటేషన్ వచ్చినా కొందరు అగ్గిపుల్లను చెవిలో పెట్టి తిప్పుతారు. ఇలా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవంటున్నారు నిపుణులు.

అగ్గిపుల్ల గట్టిగా ఉండటంతో చెవి లోపల సున్నితమైన చర్మం గాయపడొచ్చు. దీంతో నొప్పి, మంట రావచ్చు.

అగ్గిపుల్ల శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా చెవిలోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది.

చెవిలోని మైనాన్ని బయటకు తీయాల్సింది పోయి ఇంకా లోపలికి నెట్టే ప్రమాదం ఉంటుంది. దీంతో బ్లాకేజ్ పెరుగుతుంది.

చెవి లోపల భాగం దెబ్బతింటే తాత్కాలికంగా లేదా తీవ్రమైతే వినికిడి సమస్యలు రావచ్చు.

బలంగా గుచ్చితే చెవి డ్రమ్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇది చాలా సీరియస్ సమస్య.

చెవి లోపల స్కిన్ డ్రై అయి మరింత దురద కలిగే అవకాశం ఉంటుంది.

అజాగ్రత్తగా చెవిలో అగ్గిపుల్ల పెడితే చిన్న గాయాలు ఏర్పడి రక్తం రావచ్చు.

పిల్లల చెవులు చాలా సున్నితంగా ఉంటాయి. అగ్గిపుల్లతో శుభ్రం చేయడం వల్ల తీవ్రమైన గాయాలు కావచ్చు.

గులిమి పూర్తిగా చెడ్డది కాదు. అది దుమ్ము, బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. దాన్ని పూర్తిగా తీసేయడం మంచిది కాదు.

అగ్గిపుల్లలు, హెయిర్‌పిన్లు, కాటన్ స్టిక్స్ కూడా లోపల పెట్టొద్దని ENT నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్ ద్వారా చెవి శుభ్రం చేయించుకుంటే మంచిది.