పానిక్ అటాక్స్ రావడానికి కారణాలు ఏమిటి?

Published by: Geddam Vijaya Madhuri

ఉద్యోగంం, డబ్బు, కుటుంబ సమస్యలు వంటి ఒత్తిడి ఎక్కువకాలం ఉంటే పానిక్ అటాక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఎక్కువగా టెన్షన్ పడే వాళ్లలో పానిక్ అటాక్స్ ఎక్కువగా కనిపిస్తాయి.

సరిగా నిద్రపోకపోతే మెదడు, నరాలు ఒత్తిడికి గురవుతాయి. దీంతో ఒక్కసారిగా భయం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు రావచ్చు.

టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే గుండె వేగం పెరిగి పానిక్ ఫీలింగ్ కలిగే అవకాశం ఉంటుంది.

యాక్సిడెంట్లు, భయంకర సంఘటనలు, మానసిక షాక్ వంటి అనుభవాలు కొందరిలో పానిక్ అటాక్స్‌కు కారణమవుతాయి.

ఫ్యామిలీలో ఎవరికైనా ఆందోళన లేదా పానిక్ డిసార్డర్ ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం కొంత పెరుగుతుంది.

థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా గుండె దడ, టెన్షన్ పెరిగే అవకాశం ఉంటుంది.

ఆల్కహాల్, సిగరెట్లు లేదా కొన్ని డ్రగ్స్ నరాల వ్యవస్థపై ప్రభావం చూపి పానిక్ అటాక్స్‌ను ట్రిగ్గర్ చేయొచ్చు.

ఎక్కువకాలం ఒంటరిగా ఉండటం, డిప్రెషన్, ఎమోషనల్ స్ట్రెస్ కూడా కారణం కావచ్చు.

హార్ట్ సమస్యలు, షుగర్, థైరాయిడ్ వంటి కొన్ని ఆరోగ్య సమస్యల లక్షణాలు కూడా పానిక్ అటాక్స్‌లా కనిపించొచ్చు.

ఇలా మీకు రెగ్యులర్గా పానిక్ అటాక్స్ వస్తే తప్పక డాక్టర్‌ను కలవడం మంచిది.