మెంతులు తింటే మధుమేహం(Diabetes) కంట్రోల్ అవుతుందా?

మెంతుల్లో ఉండే సాల్యూబుల్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ జీర్ణం నెమ్మదిగా జరిగేలా చేసి షుగర్ ఒక్కసారిగా పెరగకుండా సహాయపడొచ్చు.

కొన్ని అధ్యయనాల ప్రకారం మెంతులు శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకునేలా హెల్ప్ చేస్తాయి.

మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది.

మెంతులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. అలాగే మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి.

బరువు ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ రిస్క్ పెంచుతుంది. మెంతులు వెయిట్ మేనేజ్‌మెంట్‌కు హెల్ప్ చేస్తాయి.

రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను ఉదయాన్నే తీసుకోవడం చాలామంచిది.

మెంతులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల కొంతమందికి బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.

మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో కొంత మేలు చేయవచ్చు.

డయాబెటిస్ ఉన్నవారిలో గుండె సమస్యల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మెంతులు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి.

మెంతులు ఆరోగ్యానికి ఉపయోగపడినా.. డాక్టర్ సూచించిన మందులు ఆపేసి మాత్రం తీసుకోకూడదు.