ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri

ఇడ్లీ రుచి, టెక్స్చర్ బాగా రావాలంటే సరైన పదార్థాలు ఎంచుకోవాలి. పాత బియ్యం, మంచి మినప్పప్పు వాడితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

సాధారణంగా 3:1 లేదా 4:1 నిష్పత్తిలో ఇడ్లీ రవ్వ, మినప్పప్పు తీసుకుంటే మంచిది. మినప్పప్పు తక్కువైతే ఇడ్లీలు గట్టిగా మారుతాయి.

రవ్వ, మినప్పప్పును కనీసం 4–6 గంటలు నానబెట్టాలి. లేదంటే బ్యాటర్ సరిగ్గా రాదు.

మినప్పప్పు గ్రైండ్ చేసేప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దే ఇదే ఇడ్లీలు మెత్తగా రావడానికి హెల్ప్ చేస్తుంది.

చాలామంది ఎక్కువ నీళ్లు పోసి బ్యాటర్ పల్చగా చేస్తారు. దీంతో ఇడ్లీలు సరిగా పొంగవు. బ్యాటర్ ఎప్పుడు మధ్యస్థంగా ఉండాలి.

వేడి వాతావరణంలో ఉన్నప్పుడు ఉప్పు ముందుగా వేస్తే ఎక్కువ పులుస్తుంది. కాబట్టి వాతావరణాన్ని బట్టి ఉప్పు కలపాలి.

బ్యాటర్ కనీసం 8 గంటలు లేదా రాత్రంతా పులియనివ్వాలి. దీనివల్ల ఇడ్లీలు స్పాంజీగా వస్తాయి.

మినప్పప్పుతో పాటు కొద్దిగా మెంతులు నానబెట్టి గ్రైండ్ చేస్తే ఇడ్లీలు ఇంకా మెత్తగా వస్తాయి.

ఇడ్లీ ప్లేట్స్‌కు కాస్త నూనె రాస్తే ఇడ్లీలు అతుక్కోకుండా సాఫ్ట్‌గా బయటకు వస్తాయి.

ఇడ్లీలు ఉడికిన తర్వాత కూడా ఎక్కువసేపు స్టీమ్లో ఉంచితే గట్టిపడే అవకాశం ఉంటుంది.