వేసవిలో మటన్ తినొచ్చా? లాభమా? నష్టమా?

Published by: Geddam Vijaya Madhuri

మటన్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు, వేడి పెరగడం వంటి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి లిమిటెడ్గా తీసుకోవాలి.

మటన్‌లో ప్రోటీన్‌, ఐరన్‌, విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి బలం, ఎనర్జీ అందించడంలో సహాయపడతాయి.

వేసవిలో ఎక్కువ ఆయిల్‌, మసాలాలతో చేసిన మటన్ కర్రీలు తింటే అజీర్ణం, గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.

మధ్యాహ్నం సమయంలో మటన్ తినడం మంచిది. రాత్రివేళల్లో తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

మటన్‌తో పాటు సలాడ్స్‌, పెరుగు, నీరు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి తగ్గించుకోవచ్చు.

వేసవిలో డీప్ ఫ్రై చేసిన మటన్ ఐటమ్స్ కంటే ఉడికించిన లేదా తక్కువ ఆయిల్‌తో చేసిన వంటకాలు మంచివి.

హై బీపీ, కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు ఉన్నవారు మటన్‌ను పరిమితంగా తీసుకోవాలి. దీనిలో సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి.

వేసవిలో బయట నిల్వ చేసిన మటన్ తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఫ్రెష్‌గా వండినదే తినాలి.

మటన్ తిన్న తర్వాత నీరు తక్కువగా తాగితే డీహైడ్రేషన్‌, అలసట వంటి సమస్యలు రావచ్చు.

వారానికి ఒకసారి లేదా రెండుసార్లు పరిమిత మోతాదులో మటన్ తీసుకోవచ్చు.

ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.