నిద్ర తక్కువైతే హై బీపీ వస్తుందా? లో బీపీ వస్తాదా?

Published by: Geddam Vijaya Madhuri

లో బీపీ కంటే రక్తపోటు పెరగడానికే నిద్రలేమి ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు నిపుణులు.

నిద్ర సరిపోకపోతే శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. ఇవి గుండె వేగం, రక్తపోటు పెరగడానికి కారణమవుతాయి.

సాధారణంగా నిద్ర సమయంలో బీపీ కొంత తగ్గుతుంది. కానీ సరైన నిద్ర లేకపోతే ఈ ప్రక్రియ సరిగా జరగక బీపీ ఎక్కువగా ఉండొచ్చు.

రోజూ 5–6 గంటలకంటే తక్కువ నిద్రపోయేవారిలో హై బీపీ ప్రమాదం ఎక్కువని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

నిద్రలేమి వల్ల ఒత్తిడి, చిరాకు, ఆందోళన పెరుగుతాయి. ఇవి కూడా రక్తపోటుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

సరైన నిద్ర లేకపోతే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

నిద్ర తక్కువగా ఉండే వారికి ఊబకాయం, డయాబెటిస్ ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇవి హై బీపీకి ముఖ్య కారణాలు.

స్లీప్ అప్నియా వంటి నిద్ర సమస్యలు ఉన్నవారిలో రాత్రిపూట ఆక్సిజన్ తగ్గి బీపీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

సాధారణంగా రోజుకు 7–9 గంటల నాణ్యమైన నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నిద్రలేమి, తలనొప్పి, అలసట, బీపీ మార్పులు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.