ఈ కూరగాయలు వేసవిలో తినకండి.. ఎందుకంటే వేడి చేస్తాయి

Published by: Geddam Vijaya Madhuri

బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అధికంగా తింటే శరీరంలో వేడి, అలసట పెరిగే అవకాశం ఉంటుంది.

వంకాయను కొందరు హీట్ ప్రొడ్యూసింగ్ వెజిటేబుల్గా భావిస్తారు. ఎక్కువగా తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగినట్లు అనిపించవచ్చు.

ఘాటు, కారం ఎక్కువగా ఉండే పచ్చిమిర్చి అధికంగా తీసుకుంటే చెమటలు, కడుపులో మంట పెరగొచ్చు.

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే అయినా.. వేసవిలో అధికంగా తీసుకుంటే శరీర వేడి పెరిగే అవకాశం ఉంటుంది.

అల్లం జీర్ణక్రియకు మంచిది. కానీ అధిక వేడి సమయంలో ఎక్కువగా తీసుకుంటే హీట్ ఫీలింగ్ పెరగొచ్చు.

ఉల్లిపాయలు సాధారణంగా చల్లదనాన్ని ఇస్తాయి. కానీ ఎక్కువ నూనె, మసాలాతో వండితే శరీరంపై భారం పెరుగుతుంది.

క్యాలీఫ్లవర్ కొంతమందిలో ఇది జీర్ణ సమస్యలు, బ్లోటింగ్‌కు కారణమవుతుంది. వేసవిలో అసౌకర్యం పెరిగే అవకాశం ఉంటుంది.

క్యాబేజీ కూడా కొందరిలో గ్యాస్, అజీర్ణం కలిగిస్తుంది. అధిక వేడిలో జీర్ణక్రియ మందగిస్తే ఇబ్బంది పెరుగుతుంది.

మష్రూమ్స్ త్వరగా జీర్ణం కాకపోవచ్చు. వేసవిలో ఎక్కువగా తీసుకుంటే బరువుగా అనిపించవచ్చు.

కూరగాయల కంటే వాటిని వండే విధానం ముఖ్యం. డీప్ ఫ్రై, అధిక మసాలా, నూనెతో చేసిన వెజిటేబుల్ వంటలు డీహైడ్రేషన్, అలసట పెంచుతాయి.