విటమిన్ E వల్ల కలిగే లాభాలు.. శరీరానికి ఎందుకు అవసరమంటే?

Published by: Geddam Vijaya Madhuri

విటమిన్ E చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. డ్రై స్కిన్, చర్మ దెబ్బతినడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని తగ్గించడంలో విటమిన్ E కీలక పాత్ర పోషిస్తుంది.

రోగనిరోధక శక్తిని బలపరచి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

జుట్టు పొడిబారడం, విరిగిపోవడం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో హెయిర్ గ్రోత్‌కు కూడా సహాయపడవచ్చు.

రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

వయస్సుతో వచ్చే కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ E హెల్ప్ చేస్తుంది.

చర్మ కణాల రిపేర్ ప్రక్రియకు సహాయపడటం వల్ల గాయాలు త్వరగా మానేందుకు ఉపయోగపడుతుంది.

ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ను తగ్గించడం ద్వారా మెదడు పనితీరును కాపాడడంలో సహాయపడవచ్చు.

హార్మోన్ల ఆరోగ్యాన్ని సపోర్ట్ చేయడంలో విటమిన్ E పాత్ర ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్, పల్లీలు, పాలకూర, అవకాడో, వెజిటేబుల్ ఆయిల్స్ వంటి ఆహారాల్లో విటమిన్ E సమృద్ధిగా లభిస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.