అన్వేషించండి

Body Pains In Winter : చలికాలంలో ఒళ్లు నొప్పులు పెరగడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు

Winter Body Pains : చలికాలంలో చాలామందికి ఒళ్లు నొప్పులు, కండరాల బిగుతు, కీళ్ల నొప్పులు ఎక్కువగా అనిపిస్తాయి. ఇలా జరగడానికి కారణాలు ఏంటో.. ఎలాంటి జాగ్రత్తలు, అలవాట్లతో నొప్పులు తగ్గిచ్చుకోవచ్చంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చలిలో కండరాలు, కీళ్లు బిగుసుకుపోయి నొప్పులు పెరుగుతాయి.
  • చలినుంచి రక్షణకు వెచ్చని దుస్తులు, గోరువెచ్చని స్నానాలు ఉపశమనం.
  • తేలికపాటి వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర ముఖ్యం.
  • నొప్పి తీవ్రమైతే, వాపు, జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించండి.

Winter Body Aches : చలికాలం వచ్చిందంటే చల్లని వాతావరణంతో పాటు కొందరిలో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల బిగుతు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా వయసు పైబడినవారు, ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఎక్కువగా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటారు. అయితే చలికాలంలో నొప్పులు పెరగడానికి కారణాలు ఏంటి? వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం. 

ఒళ్లు నొప్పులు పెరగడానికి కారణాలు ఇవే..

ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు కండరాలు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలం కొంత బిగుతుగా అనిపించవచ్చు. దీంతో కదలికలు తగ్గి, ఉదయం నిద్రలేచినప్పుడు ఒళ్లు నొప్పులు, కండరాల పట్టేయడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చలికి శరీరం స్పందించే క్రమంలో చర్మం దగ్గర ఉండే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల శరీరం వేడిని కాపాడుకుంటుంది. దీనివల్ల కండరాలు, కీళ్ల దగ్గర అసౌకర్యాన్ని పెంచినట్లు అనిపించవచ్చు.

Also Read : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!

ఆర్థరైటిస్ ఉన్నవారికి..

ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు చలికాలంలో కీళ్ల నొప్పులు, బిగుతును ఎక్కువగా అనుభవించవచ్చు. వాతావరణ మార్పులు నొప్పుల తీవ్రతను ప్రభావితం చేయవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. 

పాత గాయాలు ఉంటే..

గతంలో కండరాలు లేదా కీళ్లకు గాయాలైనవారు చలికాలంలో ఆ ప్రాంతంలో నొప్పి, అసౌకర్యాన్ని ఎక్కువగా గుర్తించవచ్చు. ముఖ్యంగా పాత గాయాలు ఉన్న చోట బిగుతు, నొప్పి అనిపించవచ్చు. అంతేకాకుండా చలిగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం, వ్యాయామం చేయడం చాలామంది తగ్గించేస్తారు. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడటంతో పాటు కీళ్ల బిగుతు పెరగవచ్చు. శారీరక చురుకుదనం తగ్గడం కూడా నొప్పులకు కారణం కావచ్చు.

Also Read : జిమ్‌లో లెగ్ డే తర్వాత కాళ్లు విపరీతంగా నొప్పిగా ఉన్నాయా? పెయిన్ తగ్గించుకోవడం ఎలా.. మరుసటి రోజు జిమ్‌కు వెళ్లాలా?

ఒళ్లు నొప్పులు తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ 

చలికి శరీరం ఎక్కువగా గురికాకుండా లేయర్లుగా దుస్తులు ధరించండి. ముఖ్యంగా చేతులు, కాళ్లు, మెడ, మోకాళ్లను చలి నుంచి రక్షించుకోవాలి. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటే అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాల బిగుతు తగ్గి కొంత ఉపశమనం కలగవచ్చు. నొప్పిగా ఉన్న ప్రాంతంలో వెచ్చని కాపడం కూడా పెట్టుకోవచ్చు. 

తేలికపాటి వ్యాయామం

చలిగా ఉందని వ్యాయామాన్ని పూర్తిగా మానేయకూడదని నిపుణులు చెప్తున్నారు. నడక, సైక్లింగ్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం, కండరాలను నెమ్మదిగా సాగదీయడం వల్ల బిగుతు తగ్గవచ్చు. ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు ప్రతి 60 నిమిషాలకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవాలి. మధ్యమధ్యలో చేతులు, కాళ్లు, మెడను నెమ్మదిగా కదిలించాలి. ఇలా చేయడం వల్ల కండరాలు చురుకుగా పనిచేస్తాయి. 

Also Read : జిమ్ చేసిన తర్వాత ఒళ్లు నొప్పిగా ఉందా? మొదట్లో బాడీ పెయిన్స్ రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

ఫుడ్ విషయంలో చేయాల్సిన మార్పులు

రోజువారీ ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఉండేలా చూసుకోండి. పాలు, పెరుగు, పప్పులు, గుడ్లు, ఆకుకూరలు వంటి ఆహారాలను తీసుకోవచ్చు. విటమిన్ డి లోపం కండరాల బలహీనత, నొప్పులకు కారణం కావచ్చు. లోపం ఉందని అనుమానం ఉంటే వైద్యుల సలహాతో పరీక్ష చేయించుకోవాలి. అలాగే నీటిని తక్కువ తాగకూడదు. శరీరానికి అవసరమైనంత ద్రవాలు అందించాలి. 

నిద్ర చాలా ఇంపార్టెంట్..

ప్రతిరోజూ తగినంత నిద్రపోవడం కండరాల పునరుద్ధరణకు, శరీరం కోలుకోవడానికి అవసరం. రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్రపోయే సమయంలో శరీరానికి సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలంటే..

చలికాలంలో వచ్చే ప్రతి ఒళ్లు నొప్పినీ వాతావరణ ప్రభావంగా అనుకుని నెగ్లెక్ట్ చేయకూడదు. నొప్పి ఎక్కువగా ఉండటం, రోజురోజుకీ పెరగడం, కీళ్లు వాపు లేదా ఎర్రబడటం, జ్వరం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. నొప్పితో పాటు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అకస్మాత్తుగా తీవ్రమైన బలహీనత వస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.

Also Read : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fatty Liver Diet : ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. రోజూ తాగితే మంచిదేనా?
ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. రోజూ తాగితే మంచిదేనా?
Winter Health Tips for Kids : పిల్లలకు చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పేరెంట్స్ ఫాలో అయిపోండి
పిల్లలకు చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పేరెంట్స్ ఫాలో అయిపోండి
Eating on Time : టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Henna for Grey Hair : తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Embed widget