అన్వేషించండి

Excessive Typing Side Effects : రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు

Repetitive Strain Injuries : కొందరు చాలా గట్టిగా టైప్ చేస్తారు. మరికొందరు రోజంతా టైప్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వారికి ఫ్యూచర్లో చేతి, మణికట్టు, వేళ్లు డ్యామేజ్ అవుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల అతి వాడకం వల్ల చేతులు, మణికట్టు సమస్యలు.
  • పునరావృతమయ్యే ఒత్తిడి గాయాలు (RSIs) పెరుగుతున్నాయి, లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
  • తప్పు భంగిమ, మధ్యలో విరామం తీసుకోకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.
  • నివారణకు సరైన భంగిమ, వ్యాయామాలు, అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.

Typing Could Lead to Serious Hand Problems : ఈరోజుల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు లేకుండా పని చేయడం దాదాపు అసాధ్యంగా మారింది. ఐటీ ఉద్యోగులు, ఆఫీస్ వర్కర్స్‌, విద్యార్థులు, గేమర్స్‌ ఇలా అన్ని రకాల వారు గంటల తరబడి టైపింగ్ చేయడం, మౌస్ ఉపయోగించడం చేస్తున్నారు. అయితే ఇలా నిరంతరం చేతులను ఒకే విధంగా ఉపయోగించడం వల్ల చేతులు, మణికట్టు, వేళ్లు, మోచేయులు, భుజాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు నిపుణులు.

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌కు చెందిన క్లినికల్ డైరెక్టర్‌, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్‌, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ & ఆర్థ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి ప్రకారం.. ప్రస్తుతం రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువసేపు కీబోర్డ్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్ వాడేవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.

సమస్యలకు కారణాలు

ఒకే రకమైన కదలికలను పదే పదే చేయడం వల్ల చేతుల్లోని కండరాలు, టెండన్స్‌, నరాలు, జాయింట్లపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపాపు డాక్టర్ సునీల్. దీని కారణంగా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌, టెండనైటిస్‌, ట్రిగ్గర్ ఫింగర్‌, టెన్నిస్ ఎల్బో, మణికట్టు నొప్పి, నరాల ఒత్తిడి వంటి సమస్యలు వస్తున్నాయన్నారు.

మొదట్లో లక్షణాలు తక్కువగా కనిపిస్తాయని.. దీంతో చాలామంది దానిని నిర్లక్ష్యం చేస్తారని తెలిపారు. కానీ తర్వాత పరిస్థితి తీవ్రమై రోజువారీ పనులు చేయడం కూడా కష్టంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రారంభ లక్షణాలు ఇవే

ఈ సమస్యలు మొదరయ్యే ముందు ప్రారంభంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. వేళ్లు మొద్దుబారడం, మణికట్టు లేదా బొటనవేలు నొప్పి, ఉదయం సమయంలో చేతులు గట్టిపడినట్లు అనిపించడం, వస్తువులను బలంగా పట్టుకోలేకపోవడం, మోచేయి నుంచి చేతివరకు మంటగా అనిపించడం, వేళ్లు లాక్ అయినట్లు లేదా క్లిక్ శబ్దం రావడం, రాత్రి సమయంలో లేదా ఎక్కువసేపు టైపింగ్ చేసిన తర్వాత నొప్పి పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

భంగిమ కూడా కారణమే

తప్పు పొజిషన్‌లో కూర్చొని పని చేయడం కూడా ఈ సమస్యలకు ప్రధాన కారణమని చెప్తున్నారు నిపుణులు. టైపింగ్ సమయంలో మణికట్టును వంచి ఉంచడం, నిరంతరం మౌస్ వాడడం, చేతులకు సపోర్ట్ లేకుండా పని చేయడం, చెడు భంగిమలో కూర్చోవడం వల్ల చేతులపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.

అలాగే మధ్యలో బ్రేక్స్ తీసుకోకుండా గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల కూడా కండరాల అలసట, ఇన్‌ఫ్లమేషన్ మరింత ఎక్కువవుతాయి.

నిర్లక్ష్యం చేస్తే..

ప్రారంభ దశలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్యలు ముదిరిపోయే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో స్ప్లింట్స్‌, ఫిజియోథెరపీ, మందులు, ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. నరాలపై ఒత్తిడి ఎక్కువైతే శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావచ్చని వైద్యులు చెప్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చేతులు, మణికట్టును కాపాడుకోవాలంటే ప్రతి 45 నుంచి 60 నిమిషాలకు చిన్న బ్రేక్ తీసుకోవాలి. మణికట్టు, వేళ్ల స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. టైపింగ్ సమయంలో మణికట్టును నిటారుగా ఉంచాలి. ఎర్గోనామిక్ కీబోర్డ్‌, మౌస్‌, కుర్చీలు ఉపయోగించాలి. కీబోర్డ్‌పై ఎక్కువ బలంగా టైప్ చేయకూడదు. స్క్రీన్‌ను కళ్ల స్థాయిలో ఉంచుకోవాలి. వ్యాయామం చేస్తూ కండరాల బలం, ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి. 

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే..

ఈ సమస్య కొన్ని వారాలకంటే ఎక్కువ రోజులు ఉంటే జాగ్రత్త పడాలి. చేతి నొప్పి, మొద్దుబారడం, బలహీనత, పనులు చేయడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కొనసాగితే వైద్యులను సంప్రదించాలి. ముందుగానే చికిత్స తీసుకుంటే సమస్య తీవ్రమవకుండా అరికట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget