అన్వేషించండి

Kidney-Friendly Diet : కిడ్నీ వ్యాధులు ఉన్నవారు తినకూడని ఫుడ్స్ ఇవే.. లేదంటే మరింత ప్రమాదమంటోన్న వైద్యులు

Dangerous Foods for Kidney Patients : కిడ్నీల వ్యాధులతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. లేదంటే కిడ్నీల పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందంటున్నారు. ఎందుకంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కిడ్నీ వ్యాధులు ఉన్నవారు ఉప్పు, పొటాషియం, ఫాస్ఫరస్ తగ్గించాలి.
  • ప్యాకేజ్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
  • అరటి, టమాటా, చిలగడదుంపలు వంటివి తక్కువగా తీసుకోవాలి.
  • ఆహార నియమాలు వ్యాధి దశను బట్టి మారుతాయి.

Foods to Avoid Kidney Diesases : కిడ్నీలు శరీరంలో వ్యర్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపే అత్యంత ముఖ్యమైన అవయవాలు. అయితే కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలో ఈ ఫిల్టరింగ్ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. దీంతో శరీరంలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ వంటి పదార్థాలు అధికంగా పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

యశోద హాస్పిటల్స్​కు చెందిన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశి కిరణ్ ప్రకారం కిడ్నీ వ్యాధిగ్రస్తులు.. అధిక ఉప్పు, పొటాషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. లేదంటే కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు ఇవి రక్తంలో పేరుకుపోయి వాపులు, హై బీపీ, ఎముకల బలహీనత, గుండె స్పందనలో అసమానతలు, మరింత కిడ్నీ నష్టం వంటి జరగవచ్చని హెచ్చరిస్తున్నారు.

అధిక ఉప్పుతో కూడిన ఆహారం.. 

కిడ్నీ వ్యాధులు ఉన్నవారు దూరంగా ఉండాల్సిన ఆహారాల్లో సోడియం ఒకటి. ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, పచ్చళ్ల, ప్రాసెస్ చేసిన మాంసం, ఫ్రోజెన్ ఫుడ్స్, సాస్‌లు, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో సోడియం అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేసి బీపీ పెరగడానికి కారణమవుతాయి. అందుకే బయట ఫుడ్స్ తగ్గించి ఇంట్లో తాజాగా వండిన ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పొటాషియం కూడిన ఫుడ్స్ 

తీవ్రమైన కిడ్నీ వ్యాధులు ఉన్నవారు పొటాషియం తక్కువగా తీసుకోవాలి. అరటిపండ్లు, అవకాడో, నారింజలు, టమాటాలు, బంగాళాదుంపలు, చిలగడదుంపలు, పాలకూర, బీట్‌రూట్ ఆకులు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తంలో పొటాషియం ఎక్కువైతే గుండె పనితీరుపై ప్రమాదకర ప్రభావం చూపిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో యాపిల్స్, బెర్రీలు, ద్రాక్ష, పైనాపిల్, క్యాబేజీ, కాలీఫ్లవర్, వైట్ రైస్ వంటి తక్కువ పొటాషియం ఉన్న ఆహారాలను తినడం మంచిదని డాక్టర్ శశి కిరణ్ చెప్తున్నారు.

ఫాస్ఫరస్ ఫుడ్స్ కూడా ప్రమాదమే

క్రానిక్ కిడ్నీ వ్యాధుల్లో ఫాస్ఫరస్ నియంత్రణ కూడా చాలా ముఖ్యం. అధికంగా ఫాస్ఫరస్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడటం, రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. డార్క్ సోడాలు, ప్రాసెస్ చేసిన చీజ్, సెరెల్స్, అధిక మొత్తంలో హోల్ గ్రెయిన్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన మాంసంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో దాగి ఉండే ఫాస్ఫేట్ అడిటివ్స్​న శరీరం త్వరగా గ్రహిస్తుంది. 

ప్రోటీన్ కూడా పరిమితమే

కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధిక ప్రోటీన్ తీసుకోవడంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తినడం వల్ల దెబ్బతిన్న కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుంది. అందుకే మితంగా తక్కువ పరిమాణంలో లీన్ ప్రోటీన్ సోర్సులను మాత్రమే తీసుకోవడం మంచిదని డాక్టర్ శశి కిరణ్ అంటున్నారు.

డైట్ ఎలా ఉండాలంటే..

కిడ్నీ ఫ్రెండ్లీ డైట్ ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు. వ్యాధి దశ, రక్త పరీక్షల ఫలితాలు, డయాలసిస్ అవసరమా లేదా, బీపీ, డయాబెటిస్ వంటి ఇతర సమస్యలను బట్టి ఆహార నియమాలు మారుతాయి. సరైన డైట్, తగినంత నీరు, రెగ్యులర్ చెకప్స్, బీపీ, షుగర్ నియంత్రణతో కిడ్నీ వ్యాధుల ప్రభావం తగ్గించుకోగలుగుతారు. 

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget