అన్వేషించండి

Diet for Hypothyroidism : థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? వైద్యులు సూచిస్తోన్న తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే

Thyroid Friendly Foods : థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కొన్ని ఫుడ్స్ జోలికి వెళ్లకూడదని.. అలాగే కొన్ని లిమిటెడ్గా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటి.. వాటివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • థైరాయిడ్ నియంత్రణకు సమతుల్య, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారం ముఖ్యం.
  • అయోడిన్, సెలీనియం థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి చాలా అవసరం.
  • ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర థైరాయిడ్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
  • మందులతో పాటు పోషకాహారం, వ్యాయామం, ఒత్తిడి తగ్గింపు కీలకం.

Best Foods to Eat and Avoid For Thyroid : ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ముఖ్యంగా హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే కేవలం మందులు మాత్రమే కాకుండా.. సరైన ఆహారపు అలవాట్లు కూడా థైరాయిడ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు. సరైన డైట్ పాటిస్తే హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి.. శరీరంలో వాపు, అలసట వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.

వైద్యుల సూచనలు

యశోద హాస్పిటల్స్​కు చెందిన చీఫ్ డైటీషియన్ డాక్టర్ సుజాత స్టీఫెన్ ఆర్డీ ప్రకారం.. థైరాయిడ్ సమస్యలున్నవారు సమతుల్యమైన, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం, నట్స్, విత్తనాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. మెడిటరేనియన్ డైట్ కూడా హైపోథైరాయిడిజం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.

అయోడిన్ మంచిదా? కాదా?

థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ ఎంతో అవసరం. అయోడైజ్డ్ ఉప్పు, పాల పదార్థాలు, గుడ్లు, సీఫుడ్, సీవీడ్ వంటి వాటిలో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. అయితే డాక్టర్ సలహా లేకుండా అయోడిన్ సప్లిమెంట్స్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అధికంగా అయోడిన్ తీసుకోవడం వల్ల హషిమోటోస్ థైరాయిడిటిస్ వంటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.

థైరాయిడ్ సెలీనియం లింక్..

థైరాయిడ్ ఆరోగ్యానికి సెలీనియం కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఇది థైరాయిడ్ హార్మోన్ల మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా.. థైరాయిడ్ గ్రంథిని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. బ్రెజిల్ నట్స్, ట్యూనా చేపలు, సార్డిన్స్, గుడ్లు, పప్పులు, ఓట్స్ వంటి వాటిలో సెలీనియం లభిస్తుంది.

మల్టీ విటమిన్స్..

జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ బి12 లోపాలు కూడా హైపోథైరాయిడిజంతో సంబంధం కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి లోపం వల్ల అలసట, బలహీనత, డిప్రెషన్, మెటబాలిజం మందగించడం వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని డాక్టర్ సుజాత స్టీఫెన్ తెలిపారు. కాబట్టి వైద్యుల సూచనల మేరకు ఫుడ్స్, సప్లిమెంట్స్ రూపంలో వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. 

తినకూడని ఫుడ్స్ లిస్ట్

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక చక్కెర, ప్యాకెట్ స్నాక్స్ వంటి వాటిని తగ్గించాలని సూచిస్తున్నారు. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచే ప్రమాదం ఉందంటున్నారు. బ్రోకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను మితంగా తీసుకోవచ్చని చెప్తున్నారు. అయితే వాటిని పచ్చిగా తింటే.. కొందరిలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మెడిసన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

థైరాయిడ్ మందులు తీసుకునేవారు ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి థైరాయిడ్ మందుల శోషణను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూట్రిషనిస్ట్ లేదా వైద్యుల సలహాతోనే వాటిని తీసుకోవాలని చెబుతున్నారు.

అలాగే మందులతో పాటు పోషకాహారం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్రపోవడం వంటి మంచి అలవాట్లు థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

థైరాయిడ్ రిలేటడ్ టిప్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget