PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..!
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ ప్రిక్వార్టర్స్ లో వాంగ్ జీ యీ చేతిలో పీవీ సింధు ఓటమి పాలై మెడల్ గల్లంతు చేసుకుంది. మ్యాచ్ అనంతరం మెడికల్ టైమౌట్ పై సింధు స్పందించింది.

Indian Star Shuttler PV Sindhu Crashes Out In World Championships: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఎదురుదెబ్బ తాకింది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్ లో చైనా ప్లేయర్ వాంగ్ జీ యీ చేతిలో 21-11, 15-21, 21-17 తేడాతో పీవీ సింధు పోరాడి పరాజయం పాలైంది. తన 11వ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ లో ఆడుతున్న సింధు, రికార్డు స్థాయిలో ఆరో పతకం గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఫలితం తనకు వ్యతిరేకంగా వచ్చింది.. మూడో గేమ్‌లో స్కోరు 16-16 వద్ద ఉన్న సమయంలో వాంగ్ జీ యీ తొడ కండరాల నొప్పితో కోర్టుపై పడిపోయి మెడికల్ టైమౌట్ తీసుకోవడం మ్యాచ్ లో కీలక మలుపుగా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
BWF WC'ship:
— News Arena India (@NewsArenaIndia) August 20, 2026
“Maybe that was Wang's tactics (injury), I should've been little more patient.
It hurts a lot more as you train hard.
You can learn from mistakes and see what you can do in future.
I tried hard but at the end of the day only one can win.”
- PV Sindhu pic.twitter.com/tuZj8mS6O3
వాంగ్ ఇంజ్యూరీ స్ట్రాటజీ ప్లే.. సింధుకు నిరాశ
మ్యాచ్ ముగిసిన తర్వాత పీవీ సింధు మాట్లాడుతూ చైనా ప్లేయర్ తీసుకున్న మెడికల్ బ్రేక్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. "ఆమెకు నిజంగానే గాయమైందో లేదో నాకు తెలియదు, బహుశా అది ఆమె వ్యూహం లేదా ఆమె మైండ్ గేమ్‌లో భాగం కావచ్చేమోనని అనిపిస్తోంది. ఏది ఏమైనా నేను మరింత ఏకాగ్రతతో, సహనంతో ప్రతి పాయింట్ పై ఫోకస్ చేయాల్సింది. చివరి మూడు పాయింట్లే గేమ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయని అనడంలో సందేహం లేదు. నేను కాస్త ఓపికగా ఉంంటే, ఫలితం మరింత మెరుగ్గా వచ్చేదేమో" అని పీవీ సింధు ఆశాభావం వ్యక్తం చేసింది.
💔 Heartbreak for PV Sindhu after an absolute marathon battle. Wang Zhi Yi wins in three games.
— BAI Media (@BAI_Media) August 20, 2026
But Sindhu gave it absolutely everything she had. As she always does. 💪🏾
Take a bow, champion! 🌟#SmashForIndia #BWFWorldChampionships #NewDelhi2026 pic.twitter.com/8zT5ciP7mq
రెండో గేమ్‌లో సింధు జోరు..
తొలి గేమ్‌లో ఇద్దరూ 14 పాయింట్ల వరకు సమానంగా పోరాడటంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. 41 షాట్ల మారథాన్ ర్యాలీతో అభిమానులను ఉర్రూతలూగించారు. కానీ ఆ తర్వాత సింధు వరుసగా అన్‌ఫోర్స్డ్ ఎర్రర్స్ చేయడంతో వాంగ్ జీ యీ 21-11తో మొదటి గేమ్‌ను సులువుగా తన సొంతం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో పీవీ సింధు సత్తా చాటింది. క్రాస్ కోర్ట్ స్మాష్‌లు, అద్భుతమైన నెట్ ప్లేతో ఆధిక్యాన్ని క్రమంగా పెంచుకుంది. 47 షాట్ల సుదీర్ఘ ర్యాలీ తర్వాత కూడా ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ 21-15తో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు దారి తీసేలా చేసింది.
కీలకదశలో..
డిసైడర్ గేమ్‌లో సింధు మొదట 4-1, 7-4 లీడ్ సాధించినా, వాంగ్ జీ యీ దూకుడు పెంచి 9-9తో సమం చేయడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. స్కోరు 16-16 వద్ద వాంగ్ నేలపై పడిపోవడంతో ఆట కాసేపు ఆగాల్సి వచ్చింది. మెడికల్ బ్రేక్ తర్వాత వచ్చిన వాంగ్ జీ యీ వరుసగా పాయింట్లు సాధించి, సత్తా చాటింది. 54 షాట్ల తీవ్రమైన ర్యాలీ తర్వాత సింధు షాట్ లైన్ దాటిపోవడం, నెట్ లోకి కొట్టడంతో వాంగ్ 21-17తో మ్యాచ్‌ను తన సొంతం చేసుకుంది. దీంతో పీవీ సింధు మెడల్ వేట ఆగిపోయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ట్రెండింగ్ వార్తలు





















