Hair Growth Tips for Men : మగవాళ్లు జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని సప్లిమెంట్స్ కచ్చితంగా తీసుకోవాలట.. అవేంటంటే
Hair Care Tips for Men : మగవారికి జుట్టు రాలే సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే కొన్ని సప్లిమెంట్స్ రెగ్యూలర్‌గా తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుందంటున్నారు నిపుణులు. అవేంటంటే..
Best Hair Growth Supplements for Men : జుట్టు రాలే సమస్య ఆడ, మగ తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఒకప్పుడు వయసు దాటితే బట్టతల వచ్చేది. కానీ ఇప్పుడు 20 నుంచి 25 మధ్యలోనే ఈ సమస్య వచ్చేస్తుంది. ముఖ్యంగా మగవారిలో జుట్టురాలడం, బట్టతల ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ.. జుట్టు రాలకుండా లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేయాలి. అలాగే కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. ఇంతకీ మగవారు తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ ఏంటి? వాటివల్ల జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బయోటిన్
బయోటిన్ అనేది బి కాంప్లెక్స్ విటమిన్. ఇది జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. హెయిర్ ఫాలికల్స్‌ను బలోపేతం చేసి.. జుట్టు రాలకుండా హెల్ప్ చేస్తుంది. కుదుళ్ల నుంచి పోషణ అందించి పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.
విటమిన్ ఇ
విటమిన్ ఇ సప్లిమెంట్ అనేది యాంటీ ఆక్సిడెంట్‌గా చెప్పొచ్చు. ఇది జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా చేసి.. రాలకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదలను వేగంగా ప్రోత్సాహిస్తుంది.
ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్
ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెరుగైన పోషణను అందించి.. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.
జింక్
జింక్ సప్లిమెంట్స్ హెయిర్ ఫోలికల్స్ ఫంక్షన్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్‌ను గ్రహించి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
సెలీనియం
సెలీనియం జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. ఈ ఆక్సిడెంట్ కూడా హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది.
పైన తెలిపిన సప్లిమెంట్స్ అన్ని జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు.. పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. కాబట్టి వీటిని డైట్ రూపంలో లేదా సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు. విటమిన్స్, మినరల్స్, బయోటిన్, ప్రధానంగా విటమిన్ ఈ, జింక్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. అయితే వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎన్ని తీసుకోవాలి? వంటి విషయాలను మాత్రం కచ్చితంగా నిపుణులను అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాతే వీటిని ఉపయోగించాలి.
మరిన్ని టిప్స్
జుట్టు రాలిపోవడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ముందుగా ఈ విషయాలు గుర్తిస్తే.. జుట్టు రాలడం చాలావరకు కంట్రోల్ అవుతుంది. అలాగే బయటకు వెళ్లేప్పుడు హెయిర్‌ని కవర్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా హైడ్రేటెడ్‌గా ఉండాలి. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. 8 నుంచి 9 గంటల నిద్ర ఉంటే.. జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. వ్యాయమం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను సహజంగా ప్రోత్సాహిస్తుంది.
Also Read : గుడ్లను ఇలా తింటే బరువు తగ్గొచ్చు తెలుసా? టైమింగ్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.