Heaviest Baby Born : 5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
Viral Newborn : ఒకే ఆస్పత్రిలో ఒకే రోజు 5.9 కిలోల ఒక బేబి.. 1.8 కిలోలు మరో బేబి పుట్టారు. ప్రస్తుతం వారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి డిటైల్స్ ఇవే.

New Born Baby Becomes Internet Sensation : ప్రపంచంలో ప్రతి పుట్టుక ప్రత్యేకమైనది. కానీ కొన్నిసార్లు ఆసుపత్రి నుంచి నేరుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించే పుట్టుకలు కూడా ఉంటాయి. అలాంటిదే న్యూయార్క్‌లో జరిగింది. అక్కడ జన్మించిన ఓ శిశువు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాడు. ఎందుకంటే తల్లికి బిడ్డ కొంచెం బరువుగా ఉంటాడని తెలుసు. కానీ వైద్యులు చెప్పిన బరువు విని అందరూ ఆశ్చర్యంతో షాక్ అయ్యారు. ఈ నవజాత శిశువు బరువు చాలా ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రి చరిత్రలోకెల్లా అత్యంత బరువైన శిశువుగా రికార్డు సృష్టించాడు. దీంతో ఫోటోలు బయటకు వచ్చి.. ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యాయి. కొందరు అతన్ని 'జైంట్ బేబీ' అని పిలిస్తే.. మరికొందరు 'చిన్న కుస్తీయోధుడు' అని పిలుస్తున్నారు.
5.9 కిలోల రికార్డు బ్రేకింగ్
న్యూయార్క్‌లోని ఇథాకాలోని కేయుగా మెడికల్ సెంటర్లో జనవరి 31న టెరికా, షాన్ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. బిడ్డకు షాన్ జూనియర్ అని పేరు పెట్టారు. పుట్టినప్పుడు అతని బరువు 5.9 కిలోలు. ఇది సాధారణ నవజాత శిశువుల సగటు బరువు కంటే దాదాపు రెట్టింపు. నివేదికల ప్రకారం.. ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు జన్మించిన శిశువుల్లో ఇదే అత్యంత బరువు కలిగిన శిశువు.
షాకైన తల్లి
నలుగురు పిల్లల తల్లి టెరికా మాట్లాడుతూ.. బిడ్డ కొంచెం బరువుగా ఉంటాడని అనుకున్నానని.. కానీ ఇంత బరువు ఉంటాడని ఊహించలేదని చెప్పింది. తాను మూడు నెలల బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఉందని ఆమె సరదాగా అన్నారు. షాన్ జూనియర్ ఇప్పటికే మూడు నుంచి ఆరు నెలల పిల్లల బట్టలు, డైపర్లను ధరిస్తున్నాడు.
అదే రోజున 1.8 కిలోల చిన్నారి జననం
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అదే రోజున అదే ఆసుపత్రిలో మార్గోట్ అనే మరో చిన్నారి కూడా జన్మించింది. ఆమె బరువు కేవలం 1.8 కిలోలు మాత్రమే. ఆసుపత్రి యాజమాన్యం ఇద్దరు నవజాత శిశువుల ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేసింది. ఇందులో ఇద్దరి పరిమాణాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. మార్గోట్ తల్లి క్లోయి మాట్లాడుతూ.. ఈ క్షణం చాలా అందంగా ఉందని.. ప్రతి బిడ్డ భిన్నంగా ఉంటారనేందుకు ఇది నిదర్శనమని తెలిపారు.
సెంట్రలస్ హెల్త్ మాతృత్వ, శిశు ఆరోగ్య డైరెక్టర్ రాబిన్ టోర్గల్స్కీ మాట్లాడుతూ.. ఈ రెండు పుట్టుకలు ప్రతి నవజాత శిశువు, ప్రతి పుట్టుక అనుభవం భిన్నంగా ఉంటాయనడానికి మంచి ఉదాహరణ అని అన్నారు. బిడ్డ నాలుగు పౌండ్లు లేదా పదమూడు పౌండ్లు ఉన్నా.. వైద్య బృందం ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉంటుందని అన్నారు.
సోషల్ మీడియాలో రెస్పాండ్ ఎలా ఉందంటే..
ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించగానే.. నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు. ఒకరు "ఇతను పుట్టిన వెంటనే స్కూల్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు" అని రాశారు. మరొకరు "ఇంత ఆరోగ్యకరమైన బిడ్డ.. ఇది దేవుని ప్రత్యేక కృప" అని అన్నారు. చాలా మంది వినియోగదారులు వైద్యులు, తల్లి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఒకే రోజున జన్మించిన ఇద్దరు పిల్లల వేర్వేరు బరువులతో ఆశ్చర్యపరుస్తున్నారు.























