హెయిర్ కేర్

చలికాలంలో జుట్టు బాగా పెరగాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

పొడిబారకుండా..

చలికాలంలో జుట్టు ఎక్కువ డ్రై అయిపోతుంది. కాబట్టి హైడ్రేటింగ్ షాంపూ, కండీషనర్, హెయిర్ మాస్క్​లు ఉపయోగిస్తే జుట్టు పొడిబారకుండా ఉంటుంది.

స్టైలింగ్ టిప్స్..

జుట్టును స్టైల్ చేయాలనుకుంటే.. దానిని విరమించుకోండి. ఇది జుట్టును డ్రైగా చేసి.. హెయిర్ ఫాల్​కి కారణమవుతుంది. ఒకవేళ తప్పక వాడాలనుకున్నప్పుడు హీట్ ప్రొటెక్ట్ స్ప్రేని ఉపయోగించాలి.

సల్ఫేట్ ఫ్రీ..

సల్ఫేట్ ఫ్రీ, మృదువైన షాంపూలను ఉపయోగిస్తే జుట్టు రాలకుండా ఉంటుంది. కండీషనర్ కూడా సల్ఫేట్ ఫ్రీది ఎంచుకుంటే మంచిది.

కవర్ చేయండి..

చలిలో బయటకు వెళ్లినప్పుడు హ్యాట్ లేదా స్కార్ఫ్ ఉపయోగించండి. చల్లని గాలుల నుంచి జుట్టును కవర్ చేస్తే.. హెయిర్ డ్రైగా కాకుండా ఫాల్ కాకుండా ఉంటుంది.

హైడ్రేషన్..

రోజుకు కనీసం 8 నుంచి పది గ్లాసుల నీటిని కచ్చితంగా తీసుకోవాలి. ఓమేగా రిచ్ 3 ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి జుట్టుకి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.

రెగ్యూలర్ ట్రిమ్స్

జుట్టు పెరుగుదల ఉండాలంటే.. కనీసం ఆరు నుంచి 8 వారాలకోసారి చివర్ల కట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల స్ప్లిట్ ఎండ్స్ కూడా కంట్రోల్​లో ఉంటాయి.

నూనె అప్లై చేస్తే..

జుట్టుకు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఆర్గాన్ ఆయిల్ అప్లై చేయాలి. జుట్టు చివర, స్కాల్ప్​పై ప్రధానంగా నూనెను రాస్తే జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ అందుతుంది.

సీరమ్స్..

జుట్టు ఎక్కువ చిక్కులు పడకుండా.. సీరమ్స్​ను ఉపయోగించాలి. దీనివల్ల హెయిర్ బ్రేకేజ్ ఉండదు. అలాగే వైడ్ కోంబ్స్ కూడా జుట్టు చిక్కు తీయడాన్ని ఈజీ చేస్తాయి.

స్కాల్ప్ మసాజ్..

రోజూ రాత్రి పడుకునేముందు జుట్టును మసాజ్ చేసుకోండి. దీనివల్ల రక్తప్రసరణ పెరిగి.. జుట్టు సమస్యలు తగ్గుతాయి. పెరుగుదల బాగుంటుంది.