పెదాలు నల్లగా ఉంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
డార్క్ లిప్స్ మొత్తం అందాన్ని కరాబ్ చేస్తాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో డార్క్ లిప్స్కి చెక్ పెట్టొచ్చట. అవేంటంటే..
నిమ్మరసంలో పంచదార వేసి కలిపి స్క్రబ్‌గా పెదాలకు అప్లై చేయాలి. రెండు మూడు నిమిషాలు స్క్రబ్ చేస్తే డర్ట్ పోతుంది. వారంలో రెండుసార్లు ఇది చేయొచ్చు.
యోగర్ట్‌లో పసుపు వేసి.. ఆ పేస్ట్‌ని పెదాలకు అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి. దీనిని కూడా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయొచ్చు. ఇది కూడా మంచి ఫలితాలిస్తుంది.
కీరదోస, పుదీనా ఆకులను పేస్ట్ చేసి.. రోజూ అప్లై చేయాలి. పేస్ట్‌ను పావుగంట ఉంచాలి. ఇలా రెగ్యూలర్‌గా చేస్తే పెదాలు ఫ్రెష్‌గా, పింక్‌గా మారుతాయి.
కొబ్బరినూనెలో నిమ్మరసం చేసి కలిపి లిప్స్కి అప్లై చేయాలి. రోజూ రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేసి ఉదయాన్నే వాష్ చేయాలి. ఇది ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది.
స్ట్రాబెర్రీలలో పంచదార వేసి సున్నితంగా పెదాలను స్క్రబ్ చేయాలి. ఇది పెదాలపై నలుపుదనాన్ని పోగొడుతుంది.
పెదాలను వారానికోసారైనా ఎక్స్ఫోలియేట్ చేయాలి. అనంతరం లిప్ బామ్ అప్లై చేయాలి.
పెదాలు హైడ్రేట్‌గా ఉండేందుకు లిప్ బామ్‌లు అప్లై చేయడంతో పాటు.. నీటిని పుష్కలంగా తాగాలి. పెదాలను ఊరికే తడుపుతూ ఉంటే లిప్స్ నల్లగా మారతాయని గుర్తించుకోవాలి.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలు పొందొచ్చు.