సింపుల్ టిప్స్

మెరిసే స్కిన్​ కావాలనుకుంటే ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోండి

Published by: Geddam Vijaya Madhuri

రెగ్యూలర్​గా ఫాలో అవ్వాలి..

హెల్తీ, గ్లాసీ స్కిన్​ కావాలని అందరికీ ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ రెగ్యూలర్​గా ఫాలో అయితే మెరిసే స్కిన్​ని పొందవచ్చట. అవేంటో చూసేద్దాం.

అలో వెరా జెల్

ఫ్రెష్ అలో వెరా జెల్​ని ముఖానికి అప్లై చేసి.. అరగంట వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి. రెగ్యూలర్​గా ఇది చేస్తే చర్మం మృదువుగా, గ్లోయింగ్​గా మారుతుంది.

పసుపులో గంధం

గంధం పొడిని పాతకాలంలో బాగా వాడేవారు. అయితే పసుపు, గంధం పొడిని రోజ్​ వాటర్​లో మిక్స్ చేసి.. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇది ముఖంపై ఉన్న డర్ట్​ని క్లీన్ చేస్తుంది.

గ్రీన్ టీ

గ్రీన్​టీలో కాటన్​ బాల్స్​ని ముంచి.. వాటిని ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

రోజ్ వాటర్

కొరియన్స్ స్కిన్​ కేర్​ రోటీన్​లో రోజ్​ వాటర్ కచ్చితంగా ఉంటుంది. మీరు ముఖం కడిగిన వెంటనే దీనిని ముఖానికి అప్లై చేయాలి. ఇది స్కిన్ పీహెచ్ లెవెల్స్​ని బ్యాలెన్స్ చేసి.. మంచి గ్లోని అందిస్తుంది.

పసుపులో యోగర్ట్ కలిపి

పెరుగులో లేదా యోగర్ట్​లో పసుపు కలిపి.. రెగ్యూలర్​గా ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్​ని పావు గంట ఉంచి.. ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇది ఇన్​స్టాంట్ గ్లోని ఇస్తుంది.

హైడ్రేషన్

రెగ్యూలర్​గా నీటిని తాగడం వల్ల చర్మం పొడిబారకుండా.. ఫ్రెష్​గా ఉంటుంది. దీనివల్ల ముడతలు కూడా తగ్గుతుంది. స్కిన్ హెల్త్​కి ఇది మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

రోటీన్

స్కిన్ కేర్ రోటీన్​ అంటూ రెగ్యూలర్​గా ఫాలో అయితే కచ్చితంగా మీ స్కిన్​లో మార్పులను మీరే చూస్తారు.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మరిన్ని ఫలితాలు పొందవచ్చు.