ముఖానికి పసుపు, తేనె అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో పసుపు, తేనె. ఈ రెండూ దేనికవే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అయితే ఈ రెండు కలిపినప్పుడు ఇవి మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఈ కాంబినేషన్ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేస్తే ఎన్నో బ్యూటీ ఫలితాలు పొందవచ్చు. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు హెల్తీ చర్మాన్ని ప్రేరేపిస్తాయి. వీటిలోని విటమిన్స్, మినరల్స్, న్యూట్రెంట్స్ వృద్ధాప్య ఛాయలను పోగొడతాయి. ముఖంపై గీతలు, గాయలు ఏర్పడితే దీనిని అప్లై చేస్తే త్వరగా తగ్గుతాయి. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పింపుల్స్‌ని దూరం చేస్తాయి. బ్లాక్ హెడ్స్, ఆయిల్ స్కిన్‌తో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఫేస్ ప్యాక్ అవుతుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.(Images Source : Envato)