శారీ కడితే ఓల్డ్‌గా కనిపిస్తాం ఏమో అని డౌట్స్ టీనేజ్ గర్ల్స్ ఎవరికైనా ఉంటే... ఆప్షన్స్ కోసం ఒక్కసారి కావ్య థాపర్ వార్డ్ రోబ్ చూడండి. మల్టీ కలర్ సిల్క్ శారీ విత్ వైబ్రెంట్ కలర్స్! టీనేజ్ గర్ల్స్‌కు బెస్ట్ ఆప్షన్. యంగ్, మోడ్రన్ లుక్ వస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ చేయించిన బ్లౌజ్, లైట్ వెయిట్ ట్రాన్స్‌పరెంట్ శారీ... ఆఫీస్ లేదా స్పెషల్ అకేషన్స్‌కు బావుంటుంది. చిన్న బ్లాక్ బోర్డర్ ఉన్న వైట్ శారీ, బ్లాక్ బ్లౌజ్ ధరించారు అనుకోండి... అందరి కళ్లు మీ మీదే ఉంటాయి. సాధారణంగా టీనేజ్ గర్ల్స్ ప్లెయిన్ కలర్స్ అవాయిడ్ చేస్తారు. కానీ, పండగలకు లైట్ కలర్ చీర కడితే వైబ్ ఉంటుంది. కావ్య థాపర్‌ను చూశారుగా... ముద్దబంతులు పక్కన మరో ముద్దబంతి ఉన్నట్టు లేదూ! బుట్ట చేతులు, జిగేల్ అనిపించే ఫ్లోరల్ డిజైన్లు... టీనేజ్ గర్ల్స్ కోసమే అన్నట్టు ఉండే ట్రెండీ శారీస్! మరిన్ని ఫ్యాషన్ టిప్స్, న్యూస్, ఫోటోస్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి (All Images Courtesy: kavyathapar20 / Instagram)