జుట్టు ఒత్తుగా పెరగాలని, హెల్తీగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల చాలామందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ ఫాలో కావడం వల్ల జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఉదయాన్నే వైడ్ కోంబ్‌తో జుట్టును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. సల్ఫేట్ ఫ్రీ షాంపు, హైడ్రేటింగ్ కండీషనర్ ఉపయోగిస్తే జుట్టుకి మంచిది. హెయిర్ సీరమ్ రాస్తే జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. గట్టిగా జడ వేయకుండా లూజ్‌గా వేయడం, హెయిర్ లీవ్ చేయడం చేయవచ్చు. జుట్టు డ్రైగా మారిపోతున్నప్పుడు నీళ్లు, అలోవెరా జెల్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. పడుకునే ముందు జుట్టును చిక్కులు లేకుండా దువ్వుకుని మసాజ్ చేసుకోవాలి. వారానికోసారి హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. (Images Source : Envato)