చాలామందికి సీజన్ మారిన ప్రతిసారి జుట్టు రాలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వెట్ హెయిర్ వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది. వర్షంలో తడిస్తే కచ్చితంగా దానిని వీలైనంత తొందరగా డ్రై చేయండి. మైల్డ్ షాంపూతో జుట్టును వారానికి మూడు సార్లు వాష్ చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావు. జుట్టుకు మంచి కండీషనర్ తప్పక అప్లై చేయాలి. దీనివల్ల పొడిబారడం తగ్గుతుంది. జుట్టును స్టైల్ చేయడం, హీట్ చేయడం చేయకపోవడమే మంచిది. జడ వేసుకోవడం లేదా క్లిప్ పెట్టే సమయంలో జుట్టు పూర్తిగా పొడిగా ఉండేలా ఆరేలా చూసుకోండి. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో స్కాల్ప్‌ను మసాజ్ చేయండి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)