కొబ్బరినూనె కేవలం జుట్టుకే కాకుండా వివిధ బెనిఫిట్స్ కోసం ఉపయోగించవచ్చు.

మీకు కళ్లకింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయా? అయితే కొబ్బరి నూనెతో ఇలా చేయండి.

1 స్పూన్ నూనె, 1 స్పూన్ అలోవెర్ జెల్ మిక్స్ చేసి రెగ్యూలర్గా మసాజ్ చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.

కొబ్బరి నూనెలో కాఫీ పొడి వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్​ను పెదాలకు అప్లై చేయాలి.

ఇది పింక్, మృదువైన పెదాలను అందిస్తుంది. డ్రై లిప్స్​ని దూరం చేస్తుంది.

కొబ్బరి నూనెలో లవంగాల పొడి వేసి కలిపి దానితో పళ్లు తోముకోవాలి.

ఇలా చేయడం వల్ల పళ్లు తెల్లగా మారడంతో పాటు, పంటి నొప్పి, నోటి దుర్వాసన దూరమవుతాయి.

కొబ్బరినూనెలో కరివేపాకు పొడిని వేసి బాగా మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.

ఇది హెయిర్​ గ్రోత్​ని ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

కొబ్బరినూనెలో నిమ్మరసం వేసి మిక్స్ చేసి మెడకు అప్లై చేయాలి.

ఇది మెడపై ఉండే డర్ట్​ని క్లీన్ చేసి.. స్కిన్​ టోన్​ని మెరుగుపరుస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Envato)