జుట్టు పెంచుకునేందుకు మార్కెట్లలో కొన్ని హెయిర్ గ్రోత్ సీరమ్స్ ఉంటాయి.

వాటిని అందరూ కొనుక్కోలేరు. అలాంటివారు ఇంట్లోనే కొన్ని హోమ్ రెమిడీస్ ఫాలో అవ్వొచ్చు.

ఇంట్లో తయారు చేసుకోగలిగే వాటితో జుట్టు పెరుగుదలను ప్రోత్సాహించవచ్చు.

వాటిలో అల్లం ఒకటి. దీని జ్యూస్​ను తలపై మసాజ్ చేసి పావుగంట తర్వాత వాష్ చేయాలి.

అలోవెరా జెల్​ను నేరుగా తలకు అప్లై చేసి అరగంట ఉంచి తలస్నానం చేయాలి.

మెంతులను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే పేస్ట్ చేసి తలకు అప్లై చేసి అరగంట తర్వాత వాష్ చేయాలి.

గ్రీన్​ టీని చల్లార్చి స్కాల్ప్​కి అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. పెరుగుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్​ను డైల్యూట్ చేసి తలకు అప్లై చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

ఉల్లిపాయ రసాన్ని తలకు అప్లై చేస్తే రక్తప్రసరణ పెరిగి జుట్టు సమస్యలు తగ్గుతాయి.

కొబ్బరినూనెతో పాటు.. కొబ్బరి పాలు కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. జుట్టు పోషణకు నిపుణులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)