జుట్టు రాలుతోందా? నూనె, షాంపులను ఇలా పెడితే చాలు! జుట్టు రాలుతుంటే ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ జుట్టు అస్సలు ఊడదు. తలస్నానం ఎక్కువగా చెయ్యడం ఏ మాత్రం మంచిది కాదు. వారంలో రెండుసార్లు మాత్రమే తల స్నానం చెయ్యండి. చాలామంది బాగా నూనె పెట్టి తల స్నానం చేస్తారు. అది కరెక్టు కాదు. తల స్నానం చేసిన తర్వాత.. జుట్టు బాగా ఆరిపోయాక నూనె పెట్టుకోవాలి. గోరు వెచ్చగా వేడి చేసిన నూనెను తలకు పట్టించి.. మునివేళ్లతో 5 నిమిషాలు మర్దనా చెయ్యండి. నూనె పెట్టిన వెంటనే జుట్టు దువ్వకండి. ఒక గంట తర్వాతే తలను దువ్వండి. ఈ విషయాలను మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. Images created with AI (ABP Desam)