చక్కెరకు ప్రత్యామ్నాయం బెల్లం. బెల్లంలో మినరల్స్, ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మం కూడా మెరుస్తుంది. బెల్లం వల్ల కలిగే లాభాలు గురించి ఇప్పుడు చూద్దాం. బెల్లం ఉండే గ్లైకాలిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. గ్రాన్యుయల్స్ చర్మం మీద డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, జింక్, సెలీనియమ్ ముఖంపై ముడతలు రానివ్వకుండా చేస్తుంది. బెల్లంలోని యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మొటిమలు రాకుండా చేస్తుంది. చర్మంపై బ్యాక్టీరియాను తొలగిస్తుంది. రోజు బెల్లం తింటే.. బ్లడ్ సర్క్యులేషన్ పెరగుతుంది. దీంతో సెల్ టర్నోవర్ ఎక్కువ అవుతుంది. స్కిన్ బ్రైట్ అవుతుంది. బెల్లంలో ఉండే పోషకాల వల్ల ఎండలోకి వెళ్లినప్పుడు స్కిన్ పాడవ్వదు. బెల్లంలో ఉండే మినరల్స్, విటమిన్స్ వల్ల దెబ్బ తగిలితే తొందరగా మానేలా చేస్తుంది.