హీరోయిన్స్‌లో ఎక్కువ వ్యాయామాలు చేస్తూ ఫిట్‌గా ఉండేవారిలో రకుల్ పేరు ముందుంటుంది. అలాగే చర్మాన్ని ఎలా అందంగా, మచ్చ లేకుండా ఉంచుకోవాలో చిట్కాలు ఇస్తోంది ఈ భామ. ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకుంటుంది రకుల్. ముఖ్యంగా బనానా, తేనే ఫేస్ ప్యాక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంది. శరీరానికి మాత్రమే కాదు చర్మానికి కూడా వ్యాయామం ముఖ్యమని చెప్తుంది. యోగా లాంటివి చేయడం వల్ల చర్మం అందంగా మారుతుందని తను నమ్ముతుంది. వేసవి కాలంలో మాత్రమే కాదు.. ఎల్లప్పుడూ సన్ స్క్రీన్ దగ్గర ఉండడం బెటర్. ప్రతీరోజూ పడుకునే ముందు విటమిన్ సీ కలిగిన సీరమ్, ఐ క్రీమ్, మాయిశ్చరైజర్‌ను తప్పకుండా ఉపయోగిస్తుంది రకుల్. ఇక పడుకునే ముందు మొహానికి క్లీన్సింగ్, టోనింగ్, మసాజ్ తప్పనిసరి. (All Images Credit: Rakul Preet/Instagram)