చీర లుక్ నే మార్చేస్తుంది. అందాన్ని మరింత పెంచేస్తుంది. ఆ అందాన్ని మరింత పెంచుకోవాలంటే.. చక్కటి హెయిర్ స్టైల్ కూడా అవసరం. అలాంటి హెయిర్ స్టైల్స్ కోసం డింపుల్ హయాతిని ఫాలో అయిపోండి. చక్కగా మధ్యపాపిడి తీసుకుని హెయిర్ ని స్టైల్ చేసుకోవచ్చు. మోడ్రన్ లుక్ ఇస్తుంది. హెయిర్ ని కొంచెం ట్విస్ట్ చేసి క్లిప్ పెట్టేసి, పూలు పెట్టుకుంటే సూపర్. చీర మీద హై బన్ వేసుకుని, దాన్ని పూలతో అలంకరిస్తే భలే ఉంటుంది. చీర కట్టుకుని మెస్సీ బన్ వేసుకున్నా క్యూట్ గా కనిపిస్తారు. చక్కటి చీర మీద బన్ వేసుకుని, ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మల్లెపూల సీజన్.. చక్కగా బన్ వేసుకుని మల్లెపూలతో ఇలా అలంకరించవచ్చు.