చర్మం అందంగా నునుపు తేలి ఉండాలంటే ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం.

అనారోగ్య ఛాయలు చర్మం మీద చాలా సులభంగా కనిపిస్తాయి.

ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమయ్యే కొన్ని తప్పని సరి ఆహారాలు తెలసుకుందాం.

శరీరంలో నుంచి టాక్సిన్లను తొలగించి చర్మం మెరవాలంటే క్యారెట్లు తప్పక తినాలి.

చిలగడ దుంపల్లో విటమిన్లు C, E ఎక్కువ. ఈ విటమిన్లు చర్మం మెరుపులీనేందుకు దోహదం చేస్తాయి.

టమాటాలను తినడం వల్ల వీటిలో ఉండే లైకోపిన్ చర్మం యవ్వనంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మొటిమలు, వాటి వల్ల వచ్చే ఎరుపును నివారిస్తాయి.

విటమిన్ A మాత్రమే కాదు పపైన్ కూడా కలిగిన బొప్పయి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

గుడ్డు తింటే బరువు తగ్గడం మాత్రమే కాదు, చర్మ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.

విటమిన్లు C, E అవకాడోలో మెండుగా ఉంటాయి. చర్మానికి హాని చేసే యూవీ కిరణాల నుంచి, ఆక్సిడేషన్ నష్టం నుంచి కాపాడుతాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels