మేకప్ బ్రష్‌లు క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి మేకప్ బ్రష్‌లను వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా ఉండే బ్రష్‌లను వాడితే మేకప్ అందంగా సెట్ అవుతుంది. ముఖం మీద బాక్టీరియా ఏర్పడకుండా చూసుకుంటుంది. మేకప్ బ్రష్‌లను గోరువెచ్చని నీళ్ళలో నానపెట్టండి. నానపెట్టిన కొద్దిసేపు తర్వాత సోప్-వాటర్ తో బ్రష్ ను శుభ్రం చేయండి. బ్రష్ కు ఉన్న పాత మేకప్ అంతా వదిలేలా శుభ్రం చేయండి. మొత్తం శుభ్రం అయ్యాక టవల్ లేదా టిష్యూ పేపర్ మీద ఆరపెట్టండి. బ్రష్‌లను జాగ్రత్తగా కడగాలి లేకపోతే వాటి కుచ్చులు ఉడిపోయే అవకాశాలు ఉన్నాయి.