మొహం అందంగా మెరియడానికి చాలా మంది సున్నిపిండి వాడుతారు. ఇది మీ శరీరంపై మృతకణాలను తొలగిస్తుంది. కేవలం సున్నిపిండే కాదు.. గోధుమ పిండి కూడా వాడొచ్చు తెలుసా? మీ ముఖానికి మెరుపుకావాలనుకుంటే మీరు దీనిని అప్లై చేసుకోవచ్చు. గోధుమపిండిలోని లక్షణాలు చర్మంపై చాలా ఎఫెక్టివ్‌గా చేస్తాయి. ఇది చర్మంపై మృతకణాలను, మొటిమలను తొలగిస్తుంది. మిమ్మల్ని పింపుల్స్ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇది ట్రై చేయండి. దీనిని మీరు కలబంద గుజ్జు, గంధం, అరటి పండుతో కలిపి తీసుకోవచ్చు. (Image Source : Pexels)