ఎలాంటి ఆభరణాలు లేకున్నా మెహందీ ఫెస్టివ్ వైబ్ తీసుకొస్తుంది. అందుకే పెళ్లి సమయంలో దీనికోసం ప్రత్యేకంగా వేడుక కూడా చేస్తారు. అయితే పెళ్లికి పెట్టుకునే మెహందీ ఎంత ఎర్రగా ఉంటే.. వధువు అంత నిండుగా కనిపిస్తుంది. మెహందీ ఎర్రగా పండేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. గోరింటాకు లేదా మెహందీ దానంతట అదే ఊడే వరకు ఉంచుకోవాలి. మెహందీ తీసిన వెంటనే కడగకుండా.. నిమ్మరసం, చక్కెర కలిపిన నీటిని వేయాలి. ఇది మెహందీ ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది. ముదురు రంగుకు మారుతుంది. పెట్రోలియం జెల్లీని అప్లై చేయడం వల్ల కూడా మెహందీ ఎర్రగా పండుతుంది. యూకలిప్టస్ ఆయిల్ కూడా మెహందీ రంగును పెంచుతుంది. (Image Source : Pexels)