వేసవిలో వేడి నీళ్లు తాగితే లాభమా? నష్టమా?

Published by: Geddam Vijaya Madhuri

ఆయుర్వేదం ప్రకారం.. ప్రతి ఒక్కరి శరీరము వేరుగా ఉంటుంది. కనుక ఏ ఇంటి చిట్కాలు బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు.

ఉదయం గోరువెచ్చని నీరు తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.

వేసవి కాలంలో వాతావరణంలో 'పిత్తం' పెరుగుతుంది. వేడి నీరు తాగడం వల్ల శరీరంలో వేడి మరింత పెరుగుతుంది.

వేసవిలో వేడి నీరు తాగడం వల్ల ఎసిడిటీ, ఛాతీలో మంట, నోటిలో పుండ్లు వంటి సమస్యలు వస్తాయి.

ఎవరైతే స్వభావరీత్యా పిత్త దోషంతో బాధపడుతున్నారో.. వారు వేసవిలో వేడి నీరు తాగేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

అధిక వేడి నీరు తాగడం వల్ల నోరు, పేగులలోని 'మంచి బ్యాక్టీరియా' సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది.

పుండ్లు, ఆమ్ల రిఫ్లక్స్ రోగులకు వేడి నీరు కడుపు లోపలి పొరను దెబ్బతీస్తుంది.

వేసవిలో ప్రతిరోజూ వేడి నీరు తాగడానికి బదులుగా అప్పుడప్పుడు లేదా గోరువెచ్చని నీరు తాగడం మంచిది.

శరీర స్థితి, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని లేదా నిపుణులైన వైద్యుని సలహా మేరకు మాత్రమే అలవాట్లను మార్చుకోండి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.