పెరుగు తినడం, తాగ‌డం వ‌ల్ల ఒంటికి చ‌ల‌వే కాకుండా.. ముఖానికి కూడా మంచిది. ముఖాన్ని మెరిసేలా చేసుకోవ‌చ్చు.

మ‌రి పెరుగుని ముఖానికి రాసుకుంటే ఎన్ని లాభాలున్నాయో చూద్దామా!

పెరుగులో ఉండే నేచుర‌ల్ ఫ్యాట్స్, ప్రొటీన్ ముఖం డ్రై అవ్వ‌కుండా చేస్తుంది. స్కిన్ కి మాయిశ్చరైజర్ గా ప‌నిచేస్తుంది.

పెరుగులోని ల్యాక్టిక్ యాసిడ్.. ఇన్ఫ్ల‌మేష‌న్, ఇరిటేష‌న్ ని త‌గ్గిస్తుంది.

పెరుగులోని నేచుర‌ల్ ఎంజైమ్స్... ముఖాన్ని మృదువుగా చేస్తాయి. మృత‌క‌ణాల‌ను తొల‌గించి ముఖాన్ని అందంగా ఉంచుతాయి.

ముఖానికి పెరుగు పెట్ట‌డం వ‌ల్ల స్కిన్ టోన్ మెరుగుప‌డుతుంది. మాయిశ్చ‌రైజింగ్, ఎక్స్ ఫోలియేటింగ్ క్వాలిటీస్ వ‌ల్ల చ‌ర్మం మెరుస్తుంది.

యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ ఇన్ఫ్ల‌మేట‌రీ క్వాలిటీస్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల యాక్నే రాకుండా చేస్తుంది పెరుగు.

పెరుగులోని నేచుర‌ల్ యాసిడ్స్.. ముఖంపై ఉన్న ఓపెన్ పోర్స్ ని టైట్ చేస్తుంది. స్కిన్ ని స్మూత్ చేసి, రిఫైండ్ గా ఉంచుతుంది.

పెరుగులోని ల్యాక్టిక్ యాసిడ్ కొలేజ‌న్ ని ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో చ‌ర్మం టైట్ అవుతుంది. ముడ‌త‌లు, ఫైన్ లైన్స్ ఏర్ప‌డ‌వు.

Image Source: Pexels

పెరుగులో చ‌ల్ల‌బ‌రిచే, మాయిశ్చ‌రైజింగ్ గుణాలు ఎక్కువ‌. దీంతో.. స‌న్ బ‌ర్న్ నుంచి కాపాడుతుంది. కంఫ‌ర్ట్ గా ఉండేలా చేస్తుంది.