డ్రెస్ ఎంత మంచిదైనా తగిన హెయిర్ స్టైల్ వేసుకుంటేనే అందం. మరి ఏ డ్రెస్ కి ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలో తెలియడం లేదా? హీరోయిన్ జెనీలియాని ఫాలో అయిపోండి. హాఫ్ బన్ విత్ లూస్ హెయిర్ భలే ఉంటుంది. అన్ని వెస్ట్రన్ డ్రెస్ లకు సూట్ అవుతుంది. హై పోనిటెయిల్.. మన లుక్స్ లో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. లుక్ ని ఇస్తుంది. టైట్ బన్.. మంచి మోడ్రన్ లుక్ ఇస్తుంది. వెస్ట్రన్ వేర్ మీదకి బాగుంటుంది. పెద్ద జడ.. చివరి వరకు అల్లి దాన్ని స్టైల్ చేస్తే బాగుంటుంది. గ్రాగ్రా మీదకి అలా సైడ్ కి దువ్వి.. వేవీగా అయ్యేలా లైట్ కర్ల్స్ చేసుకుంటే అందంగా కనిపిస్తాం. ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు మధ్యపాపిడి తీసి, చక్కగా జడ వేసుకుంటే లుక్ అదుర్స్. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నప్పుడు చక్కగా లో బన్ వేసుకుని, జువెలరీ పెట్టుకుంటే సూపర్ లుక్. ఇప్పుడు మల్లెపూల సీజన్.. చక్కగా మధ్యపాపిడి తీసి, జడవేసుకుని, మల్లెపూలు పెట్టుకుంటే సూపర్.