చర్మం మిలా మిలా మెరవాలంటే కచ్చితంగా దానికి తగ్గట్లు కేర్ తీసుకోవాలి. అందరికీ అంత టైం ఉండదు. అలాంటప్పుడు ఇంట్లో తేనెతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది. తేనెని గోరు వెచ్చటి నీటితో కలిపి క్లెన్జర్‌లా వాడొచ్చు. ముఖంపై ఉన్న డెస్ట్, ఇంప్యూరిటీస్ తొలగిపోతాయి. తేనెని మందంగా ముఖంపై మాస్క్ లా వేసుకుని 15 - 20 నిమిషాలు ఉంచుకోవాలి. దీంతో చర్మం హైడ్రేట్ అవుతుంది, మెరిసిపోతుంది. తేనెని చక్కెర లేదా ఓట్ మీల్స్ తో కలిపి ముఖానికి స్క్రబర్ లా వాడొచ్చు. మృతకణాలు ఈజీగా తొలగిపోతాయి. స్నానం చేసేటప్పుడు రెండు స్పూన్ ల తేనెని నీటిలో కలుపుకుంటే చర్మం మృదువుగా అవుతుంది. మచ్చలు, రంధ్రాలు ఉన్న చోట తేనెని పూస్తే తగ్గిపోతాయి. తేనెని బీస్ వ్యాక్స్, కొబ్బరి నూనెలో కలుపుకుని ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. పెదాలు మృదువుగా, మెరుస్తాయి. తేనెని ఆలివ్ ఆయిల్ లో కలిపి జుట్టుకి పట్టిస్తే.. జుట్టు మెరుస్తుంది. ఫ్రీజి హెయిర్ సిల్కీ అవుతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఏబీపీనీ ఫాలో అవ్వండి.