ఇతడి వయస్సు 58 ఏళ్లంటే నమ్ముతారా? డైలీ ఏం తింటాడంటే? ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి వయస్సు 58 ఏళ్లంటే నమ్మబుద్ధి కావడం లేదు కదా. ఇదేదో ఏఐ ఫొటో అని కొట్టిపడేయొద్దు. ఇది నిజమైన ఫొటోనే. సింగపూర్‌కు చెందిన ఈ వ్యక్తి పేరు చువాందో టాన్. 2017 నుంచి ఇతడు సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాడు. ఇతడికి ఒక మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇందుకు కారణం అతడి వయస్సే. 58 ఏళ్లు వచ్చినా అతడు యంగ్‌గా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టాన్ డైలీ ఉదయాన్నే ప్రోటీన్ షేక్స్ లేదా ఓట్ మీల్, గుడ్లు, తేనె, అవకాడోలు తింటాడు. లంచ్, డిన్నర్ టైమ్‌లో అన్నంతో కలిపి గ్రిల్డ్ చికెన్ లేదా చేపలు తింటాడట. మనం తిన్న క్యాలరీలను కరిగిస్తేనే.. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని టాన్ చెబుతున్నాడు. మీరు కూడా అలా చేస్తే.. టాన్‌లో యంగ్‌గా కనిపించవచ్చేమో ప్రయత్నించండి. Images Credit: Chuando Tan/Instagram