కొందరు వివిధ కారణాల వల్ల వయసుకన్నా పెద్దగా కనిపిస్తారు. మరి కొందరు వయసు పెరగడం వల్ల చూసేందుకు పెద్దగా కనిపిస్తారు. ఈ రెండు సమస్యలు ఉంటే మీరు కొన్ని హ్యాక్స్ ఫాలో అవ్వొచ్చు. వీటివల్ల యంగ్‌గా కనిపిస్తారు. రోజూ స్కిన్‌కి రోజ్ వాటర్ అప్లై చేస్తే ముఖంపై డర్ట్ పోయి.. స్కిన్ హెల్తీగా ఉంటుంది. రోజుకు 8 నుంచి 9 గ్లాసుల నీరు తాగితే చర్మం హైడ్రేటెడ్‌గా, యంగ్‌గా ఉంటుంది. బయటకెళ్లినా, వెళ్లకున్నా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ఇది చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు రెగ్యూలర్‌గా తీసుకుంటే స్కిన్ మెరుస్తూ.. యంగ్‌గా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే హెల్తీగా ఉండడంతో పాటు స్కిన్ బాగుంటుంది. ఆల్కహాల్, కాఫీ తీసుకోవడం తగ్గిస్తే స్కిన్ హెల్తీగా ఉంటుంది. రెగ్యూలర్ స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అయితే స్కిన్ హెల్తీగా ఉంటుంది.