జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసి పెరుగుదలను ప్రోత్సాహించే టిప్స్ ఇవే జుట్టురాలడమనేది వివిధ కారణాల వల్ల జరుగుతుంది. ముఖ్యంగా సీజన్ మారేప్పుడు ఎక్కువగా రాలుతుంది. వర్షంలో తడవడం వల్ల కూడా జుట్టురాలే సమస్య ఎక్కువ అవుతుంది. అయితే కొన్ని నేచురల్ టిప్స్ ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గి.. పెరుగుతుంది. విటమిన్స్, మినరల్స్ కలిగిన బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తాయి. విటమిన్ ఈ, బయోటన్, ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కలిగిన ఫుడ్స్ తీసుకుంటే ఇంకా మంచిది. రోజ్మెరీ ఆయిల్ హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుంది. బృంగరాజ్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెతో స్కాల్ప్‌కి రెగ్యూలర్‌గా మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి జుట్టు పెరుగుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను షాంపూతో కలిపి తలస్నానం చేస్తే తలపై ఉన్న డర్ట్ పోతుంది. ఒత్తిడిని తగ్గించుకుని.. రోజుకు 8 గంటల రాత్రి నిద్ర ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టురాలడానికి రీజన్ తెలుసుకుని నిపుణుల సూచనలు తీసుకుంటే హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది. (Images Source : Envato)