Eggs for Weight Loss : గుడ్లను ఇలా తింటే బరువు తగ్గొచ్చు తెలుసా? టైమింగ్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Weight Loss : గుడ్లు ఆరోగ్యానికి మంచివి. అయితే వీటిని తీసుకునే విధంగా తింటూ ఉంటే కచ్చితంగా బరువు తగ్గొచ్చు అంటున్నారు. అయితే కొన్ని సూచనలు మాత్రం ఫాలో అవ్వాలి. అవేంటంటే..
Eggs and Weight Loss : గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పలురకాల ఎమైనో యాసిడ్స్ కూడా వీటిలో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీనిలో విటమిన్ డి కూడా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లతో నిండిన గుడ్డును తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఫుడ్. సరిగ్గా తీసుకోవాలే కానీ.. ఎగ్స్ తింటూ కూడా హెల్తీగా బరువు తగ్గొచ్చు. అయితే గుడ్డును ఎలా తింటే, ఏ సమయంలో తింటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డుతింటే బరువు తగ్గుతారని.. డీప్ ఫ్రై చేసుకోవడం, ఫ్రైడ్ రైస్ వాటిలో వేసి.. ఎగ్ ఉంది కదా బరువు తగ్గిపోతామనుకుంటే సరికాదు. వాటిని తీసుకునే విధంగా డైట్లో కలిపితే.. బరువు తగ్గడంలో మంచి ఫలితాలు ఉంటాయి. వీటిని ఎలా వండుకుని డైట్లో చేర్చుకోవాలో తెలుసా?
ఉడికించుకుని
గుడ్డులో ఎలాంటి ఫ్లేవర్స్ వేయకుండా ఉడికించుకోవడం అనేది అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. ఇలా ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవడం వల్ల కేలరీలు పెరగకుండా ఉంటాయి. కేలరీలు తగ్గించుకోవడానికి ఇదో మంచి మార్గం.
కూరగాయలతో..
పాలకూర, మష్రూమ్స్ లేదా బెల్ పెప్పర్స్‌తో కలిపి ఎగ్స్ తీసుకోవచ్చు. ఈ వెజ్జీలను కాస్త ఫ్రై చేసి.. అవి ఉడికిన తర్వాత దానిపై ఎగ్ పగలకొట్టి.. స్క్రంబుల్ చేస్తే హెల్తీ డిష్ రెడీ. దీనిని తింటే ఫైబర్, న్యూట్రెంట్స్ పుష్కలంగా అందుతాయి.
ఆమ్లెట్..
మీరు ఆమ్లెట్‌గా తినాలనుకుంటే మష్రూమ్స్ లేదా పాలకూరతో కలిపి వేసుకోవచ్చు. ఇది కూడా హెల్తీగా ఎగ్స్‌ని తీసుకోవడంలో మరో పద్ధతిగా చెప్తారు.
తీసుకోవాల్సిన సమయమిదే..
బ్రేక్‌ఫాస్ట్‌గా ఉడికించిన గుడ్లు తింటే.. కడుపు నిండుగా ఉంటుంది. లంచ్ టైమ్ వరకు మీరు ఫుల్‌గా ఉండొచ్చు. వీటిని మీరు హెల్తీ స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. ఇది ఆకలిని తగ్గించి.. కడుపు నిండుగా ఉండేలా చేసి బరువు తగ్గేలా చూస్తుంది. అయితే వారానికి మూడు లేదా నాలుగు గుడ్లు తింటే సరిపోతుంది. మరీ ఎక్కువగా తింటే.. బరువు తగ్గడం కష్టమవుతుంది.
ఫాలో అవ్వాల్సిన టిప్స్
గుడ్లలోని పచ్చసొన ఎక్కువగా తినకపోవడమే మంచిది. కాబట్టి వైట్స్ తీసుకోవచ్చు. పైగా వైట్స్‌లో కేలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. ఎల్లోలో ఈ రెండూ కాస్త ఎక్కువగా ఉంటాయి. బ్రౌన్ రైస్, టోస్ట్లతో కలిపి ఎగ్స్‌ని తీసుకుంటే ఫైబర్ పుష్కలంగా అందుతుంది. ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. బటర్, నూనె, చీజ్ వంటివి వేసుకోకపోవడమే మంచిది. ఇవి కేలరీలు పెంచేస్తాయి.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ టిప్స్ ఫాలో అవుతూ.. వ్యాయామం చేస్తూ ఉంటే బరువు ఈజీగా తగ్గుతారు. హెల్తీగా కూడా ఉంటారు. పైగా గుడ్డును డైట్లో చేర్చుకోవడం వల్ల మరిన్నో ప్రయోజనాలున్నాయి. న్యూట్రిషనల్ బెనిఫిట్స్‌తో పాటు.. మెదడు ఆరోగ్యానికి, కంటి చూపునకు, గుండె హెల్తీగా ఉండేందుకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. జుట్టు పెరుగుదలలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. గోళ్లకు మంచి పోషణ అందుతుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది.
Also Read : ఆరోగ్యానికి మంచిదని పచ్చివెల్లుల్లి తింటున్నారా? సైడ్ ఎఫెక్ట్స్, రోజుకు ఎన్ని తినాలో తెలుసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.