IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) మేనేజ్‌మెంట్‌కు మరియు అభిమానులకు పెద్ద ఊరట లభించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ సీజన్ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది.
గత ఏడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించడంతో ఈసారి భద్రతపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. నిపుణుల కమిటీ స్టేడియంలోని ఎగ్జిట్ పాయింట్లు, క్రౌడ్ మేనేజ్‌మెంట్, భద్రతా చర్యలను పరిశీలించిన తర్వాతే ఈ అనుమతిని ఇచ్చింది.
తాజా షెడ్యూల్ ప్రకారం, ఆర్సీబీ తన హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో 5 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లను రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌తో పాటు, గ్రాండ్ ఫైనల్‌ను కూడా బెంగళూరులోనే నిర్వహించే అవకాశం ఉందట. భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి స్టేడియం పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా, టికెట్ కౌంటర్ల వద్ద ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















