అన్వేషించండి

Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?

Nara Lokesh: నారా లోకేష్ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఇటీవల పిల్లలు భోజనం బాగా లేదని అన్నం పారవేసిన ఘటన జరిగిన మైలవరం స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేశారు.

Nara Lokesh makes surprise visit to identify issues in mid-day meal scheme: ఏపీ మంత్రి నారా లోకేష్ మైలవరంలోని స్కూల్ ని ఆక్మసికంగా తనికీ చేశారు.  ఇటీవల మధ్యాహ్న భోజనం నాణ్యతపై తలెత్తిన వివాదం కారణంగా, ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా మంత్రి నేరుగా పాఠశాలకు  వెళ్లారు. ఈ పర్యటన అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.  

పాఠశాలకు చేరుకున్న వెంటనే మంత్రి లోకేష్ ఏమాత్రం సంకోచించకుండా విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని, వారికి వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. కొత్త కాంట్రాక్టర్ అందిస్తున్న ఆహారం ఎలా ఉంది? గతంలో ఎదురైన ఇబ్బందులేంటి? అని విద్యార్థులను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, విద్యార్థులకు ఒక కీలక సూచన చేశారు భోజనం బాగాలేకపోతే భయపడకండి, వెంటనే తల్లిదండ్రులకు చెప్పండి అంటూ వారిలో ధైర్యాన్ని నింపారు.   

ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులకు మంత్రి గట్టి వార్నింగ్ ఇచ్చారు.  మీపై పవిత్రమైన బాధ్యత ఉంది, చిన్న తప్పు జరిగినా సహించే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. తప్పు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భోజనం నాణ్యతను కేవలం ఫిజికల్‌గా తనిఖీ చేయడమే కాకుండా, లీప్ యాప్, ఐవీఆర్ఎస్ (IVRS) ద్వారా ప్రతివారం తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.     

మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పుల కోసం మంత్రి లోకేష్ ఒక భారీ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఇకపై వారానికి ఒకరోజు ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలోని ఏదో ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని నిబంధన విధించారు.  అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ఆహారం అందించడం కోసం  సెంట్రలైజ్డ్ కిచెన్  వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.                                    

పాఠశాలలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించిన మంత్రి, అక్కడ అందుతున్న పౌష్టికాహారం , పరిశుభ్రతను పర్యవేక్షించారు. కేవలం భోజనం మాత్రమే కాకుండా, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. లోకేష్ చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీ, క్షేత్రస్థాయిలో మార్పు కోరుకునే సామాన్య తల్లిదండ్రుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Breaking News: టాక్సిక్ మూవీ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేసిన పోలీసులు
టాక్సిక్ మూవీ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేసిన పోలీసులు
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Embed widget