Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేస్తూ యువతకు సందేశం ఇచ్చారు. సీజేపీ ఆందోళనను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, జంతర్ మంతర్ వద్ద జరిగిన పరిణామాలను దేశమంతా, ప్రపంచమంతా చూసిందని అన్నారు. "హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో మాట్లాడాలనిపిస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏం జరిగిందో దేశమంతా, ప్రపంచమంతా చూసింది. కొందరు అల్లరి పిల్లలు అత్యంత అసభ్యకరమైన భాషను వాడారు. ఏ నాగరిక సమాజంలోనూ స్థానం లేని పదాలను వాడారు. వారు నాతో పాటు చివరికి చనిపోయిన నా తల్లిని కూడా దూషించారు. అదంతా ఎంత అనాగరిమో మాటల్లో నేను చెప్పలేను" అన్నారు.
బాల్యం అనేది తప్పులు జరిగే సమయం, వాటి నుంచి నేర్చుకునే టైమ్ అని ప్రధాని అన్నారు. ఈరోజు, నేను వేరే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ఘటనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ‘సమాజంలో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. మన బిడ్డలు అలాంటి భాషను ఉపయోగించడం కల్చరల్ షాక్’ అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















