కొద్దిగా నెయ్యిని అరచేతిలో వేసుకోండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే మన శరీర వేడికి వెంటనే కరిగిపోతుంది.

ఒక చెంచా నెయ్యిని బాణలిలో వేసి వేడి చేసినప్పుడు కరగడానికి సమయం పట్టి పసుపు రంగులోకి మారితే అది కల్తీ కావొచ్చు.

స్వచ్ఛమైన నెయ్యి నీటిపై తేలుతుంది. కరిగినా.. కిందకు వెళ్లినా కల్తీనే.

నెయ్యిని ఒక గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచండి. అది గడ్డకట్టిన తర్వాత మొత్తం ఒకే రంగులో, ఒకేలా ఉంటే అది స్వచ్ఛమైనది

కొద్దిగా కరిగించిన నెయ్యిలో రెండు చుక్కల అయోడిన్ వేయండి. నెయ్యి రంగు నీలంలోకి మారితే కల్తీనే.

ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి, సమానంగా పంచదార , కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపినప్పుడు ఎరుపు రంగులోకి మారితే డాల్డా లిసినట్లు లెక్క.

స్వచ్ఛమైన ఆవు నెయ్యి బంగారు పసుపు రంగులో, గింజలు గింజలుగా ఉంటుంది.

తెల్లటి కాగితం పై కొంచెం నెయ్యి వేసి ఆరిన తర్వాత ఎలాంటి మరకలు లేకుండా నూనె చార మాత్రమే కనిపిస్తే అది అసలైన నెయ్యి.

స్వచ్ఛమైన నెయ్యి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది . నోటి పైభాగంలో జిడ్డుగా అంటుకుంటే కల్తీ.

అసలైన నెయ్యికి చాలా కాలం వరకు నిలిచిపోయే ఘుమఘుమలాడే సువాసన ఉంటుంది.