అన్వేషించండి

YS Sharmila On Jagan: మోదీ దత్తపుత్రుడివి కాకపోతే సీఈసీపై అభిశంసనకు మద్దతివ్వాలి - జగన్‌కు షర్మిల సవాల్

YS Sharmila: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిల సవాల్ చేశారు. ఎన్నికల నిర్వహణపై ఆరోపణలు చేస్తున్నందున సీఈసీపై అభిశంసనకు మద్దతివ్వాలన్నారు.

Sharmila demands Jagan to support impeachment of CEC:  విజయనగరం పర్యటనలో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, తన సోదరుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి తీసుకువచ్చిన అభిశంసన తీర్మానానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తమ పార్టీ ఎంపీలతో ఈ తీర్మానంపై సంతకాలు చేయించాలని సవాల్ విసిరారు.   

ఈవీఎంల మాయ జరిగిందని వైసీపీ ఆరోపణలను గుర్తు చేసిన షర్మిల                                  

రాష్ట్రంలో ఈవీఎంలు మారిపోయాయని, మహిళల ఓట్లు గల్లంతయ్యాయని గతంలో జగన్ చేసిన విమర్శలను షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దొంగతనంగా ఏర్పడిందని, ప్రజా తీర్పును అపహాస్యం చేశారని మీరు ఏడ్చిన దొంగ ఏడుపులు నిజమే అయితే.. ఇప్పుడు ఎన్నికల కమీషన్‌పై పోరాడే అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?  అని ఆమె నిలదీశారు. జగన్ కేవలం మోదీకి దత్తపుత్రుడు కాదని నిరూపించుకోవాలంటే ఈ తీర్మానానికి మద్దతు తెలపాల్సిందేనని స్పష్టం చేశారు.               

జగన్‌కు దమ్ముంటే ఇండీ కూటమి ఎమ్మెల్యేలతో కలిసి గళమెత్తాలని షర్మిల సవాల్                     

దేశంలో ఎన్నికల వ్యవస్థను ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అవసరమైన చోట దొంగ ఓట్లు చేర్చడం, అవసరం లేని చోట ఓట్లు తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదనడానికి ఏపీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే ఇండియా కూటమి ఎంపీలతో కలిసి గళం విప్పాలని, లేదంటే ఆయన బీజేపీకి బీ-టీమ్ అని ఒప్పుకోవాలని షర్మిల విమర్శించారు.                               

స్వప్రయోజనాల కోసమే ఢిల్లీ పాలకులకు జగన్ తలొగ్గుతున్నారు ! 

రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ పెద్దలకు తలొగ్గుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల కమీషన్ తీరుపై పోరాటంలో వైఎస్సార్‌సీపీ వైఖరిని బట్టే ఆ పార్టీ విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని షర్మిల అభిప్రాయపడ్డారు.  విజయనగరంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈవీఎంలు, ఎన్నికల నిర్వహణపై జగన్ గతంలో చేసిన ఆరోపణలను ఇప్పుడు ఆయనకే అస్త్రంగా మార్చి షర్మిల సంధించడం గమనార్హం.   

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget