Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
టీమిండియా నయా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్టైల్ గురించి సంజూ శాంసన్ ( Sanju Samson ) చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. సంజూ మాట్లాడుతూ.. వైభవ్ క్రికెట్ ఆడుతుంటే ఏదైనా వీడియో గేమ్ ఆడుతున్నట్లు ఉంటుందని అన్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన డెబ్యూ మ్యాచ్‌కు ముందు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌ను గుర్తు చేసుకున్నాడు.
మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, వైభవ్ చిన్న పిల్లాడు కదా అని గైడెన్స్ ఇవ్వడానికి పిలిచారట. "రేపటి మ్యాచ్‌కు నీ ప్లాన్ ఏంటి?" అని ద్రవిడ్ అడగ్గా.. వైభవ్ చాలా కూల్‌గా "ఏం లేదు సార్.. నేను ఆడుతాను అంతే" అని బదులిచ్చాడు. ద్రవిడ్ సర్ మళ్ళీ నవ్వుతూ.. "అలా కాదు, నీ గేమ్ ప్లాన్ ఏంటి? ఎలా బ్యాటింగ్ చేస్తావ్?" అని అడిగితే.. "ఒకవేళ ఫస్ట్ బాల్ నా జోన్‌లోకి వస్తే సిక్సర్ కొడుతాను సార్" అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడట.
వైభవ్ చెప్పిన మాట విని సంజూ, ద్రవిడ్ ఆశ్చర్యపోయారు. చెప్పినట్టే శార్దూల్ ఠాకూర్ వేసిన ఫస్ట్ బాల్‌ను స్టాండ్స్‌లోకి పంపాడు వైభవ్. "వాడు చెప్పినట్టే ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టడం చూసి నా మైండ్ బ్లాక్ అయ్యింది. వీడు క్రికెట్ ఆడుతున్నాడా లేక వీడియో గేమా అనిపించింది" అంటూ సంజూ ఆశ్చర్యపొయ్యాడు.























