అన్వేషించండి

Pineapple Juice : సమ్మర్లో బాడీ కూల్‌గా ఉండాలా? పైనాపిల్ జ్యూస్ బెస్ట్ సొల్యూషన్, మరెన్నో లాభాలు

Pineapple Juice in Summer : వేసవిలో పైనాపిల్ జ్యూస్ తాగితే డీహైడ్రేషన్, అలసటకు చెక్ పెట్టొచ్చని తెలుసా? దీనిని సమ్మర్లో తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు పొందవచ్చో చూసేద్దాం.

Pineapple Juice Benefits : వేసవి కాలంలో శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలసట, దాహం, తలనొప్పి వంటి సమస్యలు తరచుగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో సహజమైన పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో పైనాపిల్ జ్యూస్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది కేవలం రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మరి పైనాపిల్ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో.. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

వేడిని తగ్గించడానికి.. 

పైనాపిల్ జ్యూస్ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి.. ఎండ వల్ల కలిగే హీట్‌ను కంట్రోల్ చేస్తుంది. శరీరానికి చల్లదనాన్ని అందించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

జీర్ణ సమస్యలు దూరం..

సమ్మర్లో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసుకోవడానికి దీనిని తీసుకోవచ్చు. ఎందుకంటే పైనాపిల్‌లో “బ్రోమెలైన్” అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. పైనాపిల్ రసంలో ఉండే పోషకాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఇమ్యూనిటీని పెంచుకోవడానికి..

పైనాపిల్ జ్యూస్లో విటమిన్ C ఎక్కువగా ఉండడం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా మేలు చేస్తుంది. 

డీహైడ్రేషన్ తగ్గించడానికై.. 

పైనాపిల్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది సమ్మర్లో శరీరంలో కలిగే నీటి కొరతను దూరం చేస్తుంది. 

మెరిసే చర్మం కోసం.. 

పైనాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి నేచురల్ గ్లో ఇస్తాయి. వేడివల్ల చర్మం టాన్ అయితే ఇది తగ్గిస్తుంది. స్కిన్ హెల్తీగా మారుతుంది. 

పైనాపిల్ జ్యూస్ తయారీ

సమ్మర్లో పైనాపిల్ జ్యూస్ చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం పైనాపిల్ ముక్కలు 1 కప్పు, నీరు 1/2 కప్పు, తేనె - తగినంత, చిటికెడు ఉప్పు సరిపోతుంది. మీరు తేనెకు బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు. 

ముందుగా పైనాపిల్ ముక్కలను మిక్సీలో వేసుకోండి. కొద్దిగా నీరు కలిపి బాగా బ్లెండ్ చేయండి. అవసరమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు.  తేనె/షుగర్, నిమ్మరసం(ఆప్షన్), ఉప్పు కలపండి. మరోసారి బాగా బ్లెండ్ చేసుకోండి. దీనిని చల్లగా సర్వ్ చేసుకుంటే మంచిది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పైనాపిల్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది. కానీ దీనిని ఎక్కువగా తాగకపోవడమే మంచిది. కాబట్టి రోజుకు 1 గ్లాస్ సరిపోతుంది. షుగర్ ఉన్నవారు చక్కెర లేకుండా తాగడం మంచిది. ఖాళీ కడుపుతో ఎక్కువగా తీసుకోకూడదు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget