అన్వేషించండి

Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు

Low Blood Pressure : లో బీపీ ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఫుడ్స్ తీసుకోవడమే కాదు.. కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆల్కహాల్, అధిక కార్బోహైడ్రేట్లు, చక్కెర రక్తపోటును తగ్గిస్తాయి.
  • ప్రాసెస్డ్ ఫుడ్స్, కెఫీన్ అధికంగా తీసుకోవడం మంచిది కాదు.
  • పొటాషియం ఉన్న ఆహారాలు మితంగా, డీహైడ్రేషన్ నివారించాలి.

Low BP Diet : రక్తపోటు తక్కువగా(Low Blood Pressure/Hypotension) ఉన్నప్పుడు రోజూవారి జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలని చెప్తున్నారు. అవేంటో.. వాటిని తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆల్కహాల్‌ మానేయండి..

బీపీ తక్కువగా ఉన్నవారు మందుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ రక్తనాళాలను విస్తరించేలా చేస్తుంది. దీనివల్ల కొంతమందిలో బ్లడ్ ప్రెజర్ మరింత తగ్గవచ్చు. దీనివల్ల తల తిరగడం, బలహీనంగా అనిపించడం, నిలబడినప్పుడు కళ్లు తిరగడం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ తక్కువగా ఉండేవారు ఆల్కహాల్ తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. 

Also Read : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

పొటాషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ 

అరటిపండ్లు, కొబ్బరి నీరు, అవకాడో, బంగాళాదుంపలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి మంచివే. అయినా బీపీ తక్కువగా ఉండేవారు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు లేదా కొన్ని మందులు వాడేవారు అధిక పొటాషియం తీసుకుంటే ఎక్కువ ప్రమాదం ఉండొచ్చు. కాబట్టి వ్యక్తిగత పరిస్థితిని బట్టి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.

కార్బోహైడ్రేట్లు లైట్ తీసుకోండి..

వైట్ రైస్, బ్రెడ్, పాస్తా, స్వీట్లు వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తినడం కొందరిలో బీపీ తగ్గడానికి కారణం అవుతుంది. దీనిని postprandial hypotension అంటారు. లో బీపీ సమస్య ఉన్నవారు ఒకేసారి భారీ భోజనం తినడం కంటే చిన్న మోతాదుల్లో, సమతుల్యంగా భోజనం చేయడం మంచిది.

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

ప్రాసెస్డ్ ఫుడ్స్‌ జోలికిపోవద్దు

లో బీపీ ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా అని చిప్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్డ్ మీట్ వంటి అధిక సోడియం ఉన్న ఆహారాలను ఎక్కువగా తినడం మంచిది కాదు. వీటిలో ఉప్పుతో పాటు అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక కేలరీలు కూడా ఉండొచ్చు. కాబట్టి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. 

కెఫీన్ ఎక్కువగా తీసుకోకండి.. 

కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫీన్ ఉన్న పానీయాలు.. కొంతమందిలో బీపీను తాత్కాలికంగా పెంచవచ్చు. కానీ వాటిని లో బీపీకి చికిత్సగా తీసుకోవడం మంచిది కాదు. అధికంగా కెఫీన్ తీసుకోవడం వల్ల గుండె దడ, ఆందోళన, నిద్ర సమస్యలు రావచ్చు. కాబట్టి రోజంతా కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్‌పై ఆధారపడకుండా తగినంత నీరు, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టాలి.

Also Read : బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?

స్వీట్స్ మానేయండి

స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు, షుగర్​తో కూడిన పానీయాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్ద మొత్తంలో స్వీట్స్ తీసుకుని వెంటనే భారీ భోజనం చేయడం వల్ల భోజనం తర్వాత బీపీలో మార్పులు కనిపించవచ్చు. కాబట్టి లో బీపీ ఉన్నవారు షుగర్స్ తింటే బీపీ పెరుగుతుందనుకోవడం మంచిది కాదంటున్నారు. 

నీళ్లు తాగకపోతే కష్టమే..

డీహైడ్రేషన్ లో బీపీకి ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. అందుకే నీరు తక్కువగా తాగడం, ఎక్కువగా చెమట పట్టినా వాటర్ తీసుకోకపోవడం సమస్యను మరింత పెంచుతుంది. కాబట్టి వేసవి, వర్షాకాలంలోనూ తగినంత ద్రవాలు తీసుకోవాలి. 

లో బీపీ ఉన్నవారు ఈ ఆహారాలన్నీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ లిమిటెడ్​గా తీసుకుంటూ వైద్యుల సూచనలు ఫాలో అయితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. తల తిరగడం, మూర్ఛ, తీవ్రమైన బలహీనత, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది. 

Also Read : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
Excessive Body Heat : బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
Beerakaya Thokka Pachadi : బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది
బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
Advertisement

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget