అన్వేషించండి

High BP Diet : బీపీ ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ మానేసి.. వీటిని తినండి, రక్తపోటు అదుపులోకి వస్తుంది

High Blood Pressure Diet : రక్తపోటు అధికంగా ఉన్నవారు.. తమ లైఫ్​స్టైల్​లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్స్ తినొచ్చో.. ఏవి తినకూడదో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు, ప్రాసెస్ చేసిన మాంసం, ఫాస్ట్ ఫుడ్​లు తినరాదు.
  • సోడా, ప్యాక్డ్ జ్యూస్​ల వంటి చక్కెర పానీయాలకు, మద్యం సేవించడానికి దూరంగా ఉండాలి.
  • పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోవడం మంచిది.
  • ఆహార మార్పులు, వ్యాయామం, ఒత్తిడి తగ్గింపుతో బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.

High Blood Pressure : అధిక రక్తపోటు అనేది ఈ మధ్యకాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. బీపీ ఎక్కువైతే.. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే దానిని కంట్రోల్​లో ఉంచుకునేందుకు వైద్యులు సూచించే మందులు కచ్చితంగా వాడాలి. అలాగే బీపీని తగ్గించుకోవడంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. ఇలాంటి సమయంలో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు తినకూడని ఫుడ్స్ ఏంటో.. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బీపీ తగ్గుతుందో ఇప్పుడు చూసేద్దాం. 

అధిక ఉప్పు 

బీపీ ఎక్కువగా ఉన్నవారు ఉప్పు అధికంగా ఉండే ఫుడ్స్ తినకూడదు. చిప్స్, పికిల్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ మరింత పెరుగుతుంది.

ప్రాసెస్ చేసిన మీట్..

సాసేజ్, రెడ్ మీట్​లలో కూడా సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీపిని అదుపులో ఉంచుకునేందుకు లిమిటెడ్​గా ఫ్రెష్ మీట్ తీసుకోవచ్చు. కానీ ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్​ జోలికి వెళ్లకూడదు. 

ఫాస్ట్ ఫుడ్

బర్గర్, పిజ్జా, ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫాస్ట్​ ఫుడ్​కి దూరంగా ఉండాలి. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటుంది.  ఇది గుండెపై మరింత భారం పెంచి.. బీపిని మరింత ఎక్కువ చేస్తుంది. 

షుగర్ డ్రింక్స్

చాలా డ్రింక్స్​లలో షుగర్ ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. సోడా, ప్యాక్డ్ జ్యూస్​లు చూసేందుకు హెల్తీగా కనిపించినా వాటిలో చక్కెర ఎక్కువ ఉంటుంది. వీటిని తాగడం వల్ల బీపీతో పాటు బరువు పెరుగుతారు. 

ఆల్కహాల్.. 

మద్యం రక్తపోటును పెంచి గుండెపై ఒత్తిడి కలిగిస్తుంది. మీకు బీపీ ఉందని తెలిస్తే ఆల్కహాల్, స్మోకింగ్​కి వీలైనంత దూరంగా ఉండడం మంచిదని చెప్తున్నారు నిపుణులు. 

హై బీపీ ఉన్నవారు తినాల్సిన ఫుడ్స్..

రక్తపోటు అధికంగా ఉన్నవారు పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అరటి, కీరదోస, పాలకూర వంటివి డైట్​లో చేర్చుకోవాలి. ఇవి సోడియం ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఓట్స్, బీన్స్, నట్స్​ వంటి ఫైబర్ ఎక్కువగా ఉండేవి తినాలి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొవ్వులేని పాలు, పెరుగు తీసుకోవచ్చు. కాల్షియంతో నిండిన ఈ ఫుడ్స్ బీపీని అదుపులో ఉంచుతాయి. 
నారింజ, క్యారెట్, బ్రోకోలీ వంటి పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్స్ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. బాదం, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ హార్ట్ హెల్త్‌కు మంచివి.

డైట్​తో బీపీ తగ్గుతుందా?

ఫుడ్​లో మార్పులు చేస్తే కచ్చితంగా బీపీ కంట్రోల్ అవుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. DASH Diet అనుసరించినవారిలో బీపీ గణనీయంగా తగ్గిందని అనేక అధ్యయనాలు తెలిపాయి. ఉప్పు(సోడియం) 1500 mg లోపు తీసుకున్నవారికి బీపీ కంట్రోల్ అయినట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది. పండ్లు, కూరగాయలు, లో-ఫ్యాట్ ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనలు సూచించాయి. 

బీపీని తగ్గించే మరిన్ని అలవాట్లు.. 

బీపీ అదుపులో ఉంచుకోవాలనుకుంటే రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. అలాగే ఉప్పును తగ్గించాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి. రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకోవాలి. స్మోకింగ్ మానేసి.. వైద్యులు సూచించిన మందులు తీసుకుంటే కచ్చితంగా బీపీ అదుపులో ఉంటుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget