అన్వేషించండి

Coriander Water : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధనియాల నీరు తాగితే కలిగే లాభాలు.. బాడీ డీటాక్స్ నుంచి బరువు తగ్గడం వరకు

Soaked Coriander Water : ధనియాల నీరు ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో.. ఎలా తీసుకుంటే మంచిదో.. నిపుణుల సలహాలు ఏంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ధనియాలను రాత్రంతా నానబెట్టి ఉదయం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • శరీరంలోని టాక్సిన్స్ తొలగించి, కిడ్నీలు, లివర్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
  • మెటబాలిజం పెంచి, కొవ్వు కరిగించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

మన వంటగదిలో రెగ్యులర్​గా ఉపయోగించే మసాలాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి. అలాంటి వాటిలో ధనియాలు కూడా ఒకటి. ఇవి మంచి రుచి, అరోమాను ఇవ్వడంతో పాటు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే శరీరానికి అనేక లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో.. ధనియాలు నీరు తాగేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ధనియాల నీరు తయారీ 

ఒక గ్లాస్ నీటిలో 1 లేదా 2 టీ స్పూన్లు ధనియాలు వేయాలి. వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. లేదా వాటిని ఓ గిన్నెలో వేసి మరిగించి.. నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. మరి ఈ ధనియాల నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే.. 

మెరుగైన జీర్ణక్రియ 

ధనియాలు జీర్ణ సమస్యలను దూరం చేసి.. మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయి.

బాడీ డీటాక్స్‌

శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ధనియాల నీరు మంచి ప్రయోజనాలు ఇస్తాయి. అలాగే కిడ్నీలు, లివర్​ను డీటాక్స్ చేసి.. వాటి ఆరోగ్యాని సపోర్ట్ చేస్తాయి. 

బరువు తగ్గేందుకు.. 

ధనియాలు మెటాబాలిజాన్ని పెంచి కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనిని క్రమంగా లిమిటెడ్ మోతాదులో తీసుకుంటే బరువు తగ్గుతారు. 

బ్లడ్ షుగర్ కంట్రోల్.. 

మధుమేహం ఉన్నవారికి షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు తమ రోజుని దీనితో స్టార్ట్ చేస్తే సరి.

చర్మ ఆరోగ్యానికై..

ధనియాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం క్లీన్‌గా, గ్లోగా మారుతుంది. డల్​నెస్ తగ్గుతుంది. 

వేడి తగ్గుతుంది

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎండవల్ల కలిగే శరీర వేడిని తగ్గించడంలో మంచి ప్రయోజనాలు ఇస్తుంది. 

ఇవేకాకుండా బీపీని కంట్రోల్ చేస్తుంది. పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మూత్ర సమస్యలను దూరం చేస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్స్, మినరల్స్ వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ సమస్యను కంట్రోల్ చేస్తుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ధనియాల నీరు ఆరోగ్యానికి మంచిదే అయినా ఎక్కువ మోతాదులో తాగకండి. రోజుకు 1 గ్లాస్ సరిపోతుంది. లో బీపీ ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా తీసుకోవాలి. అలర్జీ ఉంటే వెంటనే ఆపాలి. ఎక్కువ రోజులు కంటిన్యూ తాగకుండా మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యానికి మేలు చేసే ఏ హోం రెమిడీ అయినా మితంగా తీసుకుంటేనే లాభం ఉందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా దీనిని పూర్తి మెడిసన్​గా భావించకూడదని చెప్తున్నారు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget